అభిమానులకు కోటి రూపాయలు... అప్లికేషన్ షేర్ చేసిన విజయ్ దేవరకొండ! 

Published : Sep 05, 2023, 08:12 PM IST
అభిమానులకు కోటి రూపాయలు... అప్లికేషన్ షేర్ చేసిన విజయ్ దేవరకొండ! 

సారాంశం

ఖుషి సక్సెస్ మీట్లో విజయ్ దేవరకొండ అభిమానులకు కోటి రూపాయలు ఇవ్వనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఆయన అప్లికేషన్ షేర్ చేశారు.   

హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ఖుషి సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. మూడు రోజుల్లో ఖుషి రూ. 70 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ వసూళ్లు రాబట్టింది. యూఎస్ లో అయితే వసూళ్ల వరద పారించింది. $ 1.5 మిలియన్ క్రాస్ చేసిన ఖుషి $ 2 మిలియన్ వసూళ్ల వైపు పరుగు తీస్తుంది. అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాలు పంచుతుంది. తెలుగు రాష్ట్రాల్లో సైతం బ్రేక్ ఈవెన్ కి దగ్గరవుతుంది. ఈ క్రమంలో ఖుషి(Kushi) సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. 

ఈ వేదికపై మాట్లాడిన విజయ్ దేవరకొండ ప్రేక్షకులకు, అభిమానులకు ధన్యవాదాలు చెప్పారు. ఇంతటి విజయం అందించిన అభిమానులకు ఏదో ఒకటి చేయాలని ఉంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వంద మందికి లక్ష రూపాయల చొప్పున ఒక కోటి రూపాయలు తన రెమ్యునరేషన్ నుండి పంచనున్నట్లు వెల్లడించారు. మాట నిలబెట్టుకుంటూ నేడు సోషల్ మీడియా వేదికగా అప్లికేషన్ లింక్ షేర్ చేశారు. 

లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ లో అడిగిన డిటైల్స్ పొందుపరిచి ఇబ్బందుల్లో ఉన్న వారు లక్ష రూపాయల కోసం అప్లై చేసుకోవచ్చు. వచ్చిన అప్లికేషన్స్ నుండి వంద మందిని ఎంపిక చేసి వారికి లక్ష రూపాయలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఇబ్బందుల్లో ఉన్న వారికి ఆ డబ్బులు ఉపయోగపడితే అంతకంటే ఆనందం లేదని విజయ్ దేవరకొండ అభిప్రాయపడ్డారు. 

గతంలో కూడా విజయ్ దేవరకొండ ఓ వంద మంది అభిమానులను సొంత ఖర్చులతో నార్త్ ఇండియా టూర్ కి పంపాడు. దీని కోసం ఆయన లక్షల్లో ఖర్చు చేశారు టాలీవుడ్ లో మరొక హీరో అభిమానులకు ఈ విధంగా డబ్బులు ఖర్చు చేసిన దాఖలాలు లేవు. కోవిడ్ సమయంలో కూడా విజయ్ దేవరకొండ సామాజిక బాధ్యత నెరవేర్చాడు. ఒక టీమ్ ని ఏర్పాటు చేసి పేదలకు కిరాణా, కూరగాయలు వంటి నిత్యావసరాలు అందించారు. 

ఖుషి చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. విజయ్ దేవరకొండకు జంటగా సమంత(Samantha) నటించింది. సెప్టెంబర్ 1న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. సిల్వర్ స్క్రీన్ పై సమంత-విజయ్ దేవరకొండ కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. 
 

PREV
click me!

Recommended Stories

Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ
2025లో 8 జంటల సీక్రెట్ లవ్ ఎఫైర్స్ ..లిస్ట్ లో రాంచరణ్, ప్రభాస్, మహేష్ హీరోయిన్లు