మళ్ళీ అదే పద్దతా.. విజయ్ దేవరకొండకు బోర్ కొట్టదా!

Published : Jul 08, 2019, 03:19 PM IST
మళ్ళీ అదే పద్దతా.. విజయ్ దేవరకొండకు బోర్ కొట్టదా!

సారాంశం

టాలీవుడ్ లో విజయ్ దేవరకొండకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. చిన్న పాత్రల నుంచి ఇప్పుడు క్రేజీ హీరోగా మారిపోయాడు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం చిత్రాలు విజయ్ దేవరకొండ స్థాయిని పెంచుతూ వచ్చాయి. 

టాలీవుడ్ లో విజయ్ దేవరకొండకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. చిన్న పాత్రల నుంచి ఇప్పుడు క్రేజీ హీరోగా మారిపోయాడు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం చిత్రాలు విజయ్ దేవరకొండ స్థాయిని పెంచుతూ వచ్చాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. 

భరత్ కమ్మ దర్శకత్వంలో తెరక్కుతున్న డియర్ కామ్రేడ్ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. రెండవసారి ఈ చిత్రంలో రష్మిక, విజయ్ జంటగా నటిస్తున్నారు. ఇక క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో విజయ్ పాత్ర గురించి ఆసక్తికర వార్త ప్రచారం జరుగుతోంది. 

విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో ప్లే బాయ్ గా నటిస్తున్నాడట. అమ్మాయిలతో రొమాంటిక్ గా ఉంటూ నిజమైన ప్రేమ కోసం అన్వేషించే యువకుడిగా విజయ్ దేవరకొండ పాత్ర ఉంటుందని సమాచారం. సినిమాల పరంగా ఇప్పటికే విజయ్ దేవరకొండపై ప్లే బాయ్ అనే ముద్ర పడింది. 

వరుసగా ఇదే తరహా పాత్రలు చేస్తుంటే కూడా ప్రమాదమే. విజయ్ దేవరకొండని మాస్ హీరోగా చూడాలనుకునే అభిమానులు కూడా ఉన్నారు. క్రాంతి మాధవ్ తెరకెక్కించే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. 

PREV
click me!

Recommended Stories

'అప్పుడు బిగ్ బాస్ చేసిన పనికి ఆశ్చర్యపోయా.. గిఫ్ట్‌గా లిప్‌స్టిక్‌లు పంపించాడు..'
Jana Nayakudu మూవీ `భగవంత్‌ కేసరి`కి కాపీనా, రీమేకా? అసలు నిజం చెప్పిన నిర్మాత.. ట్రోల్స్ కి ఫుల్‌ స్టాప్‌