చిన్న డైరెక్టర్ కి కొత్త విజయ్ దేవరకొండ!

Published : Feb 04, 2019, 02:42 PM IST
చిన్న డైరెక్టర్ కి కొత్త విజయ్ దేవరకొండ!

సారాంశం

టాలీవుడ్ లో వరుసగా హిట్స్ అందుకుంటున్న రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నెక్స్ట్ కూడా తన సక్సెస్ గ్రాస్ ను ఏ మాత్రం తగ్గించుకోవద్దని కొత్త కథలను ఎంచుకుంటున్నాడు. మధ్యలో నోటా సినిమా ద్వారా కాస్త దెబ్బ తిన్న విజయ్ ఇప్పుడు మాత్రం అలాంటి కన్ఫ్యూజన్ కథలను ఎంచుకోవద్దని ఆలోచిస్తున్నాడు. 

కొత్త దర్శకులైనా సక్సెస్ లేని దర్శకులైనా కాన్సెప్ట్ నచ్చితే కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఇకపోతే రీసెంట్ గా ఒక యువ దర్శకుడితో విజయ్ జత కట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల హుషారు అనే సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న యువ దర్శకుడు శ్రీ హర్ష నెక్స్ట్ విజయ్ తో వర్క్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు. 

విజయ్ దేవరకొండను సరికొత్తగా తెరపై ప్రజెంట్ చేయాలనీ కొత్త స్క్రిప్ట్ ను రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. విజయ్ ఈ కొత్త కథ కోసం ఫిట్ నెస్ లో కూడా మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం విజయ్ డియర్ కామ్రేడ్ సినిమాతో పాటు మరో రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఫుల్ స్క్రిప్ట్ ని విజయ్ కు వినిపించి శ్రీ హర్ష తన కొత్త సినిమాను స్టార్ట్ చేయాలనీ ఆలోచిస్తున్నాడు.   

PREV
click me!

Recommended Stories

Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే