గల్లీ రౌడీ టీజర్:  అంచనాలు పెంచేసిన సందీప్ కిషన్!

Published : Apr 19, 2021, 06:59 PM IST
గల్లీ రౌడీ టీజర్:  అంచనాలు పెంచేసిన సందీప్ కిషన్!

సారాంశం

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ గల్లీ రౌడీ మూవీ టీజర్ విడుదల చేయడం విశేషం. గల్లీ రౌడీ మూవీలో సందీప్ కిషన్ లుక్ ట్రెండీగా ఉంది.   

యంగ్ హీరో సందీప్ కిషన్ గల్లీ రౌడీ గా వచ్చేస్తున్నారు. కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్ర టీజర్ నేడు విడుదల చేశారు. టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ గల్లీ రౌడీ మూవీ టీజర్ విడుదల చేయడం విశేషం. గల్లీ రౌడీ మూవీలో సందీప్ కిషన్ లుక్ ట్రెండీగా ఉంది. 


ఓ ఆస్థి విషయంలో విలన్, హీరోకి మధ్య జరిగే సంఘర్షణ వినోదాత్మకంగా తెరకెక్కించారని టీజర్ ద్వారా అర్థం అవుతుంది. కోలీవుడ్ టాలెంటెడ్ నటుడు బాబీ సింహ, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక రోల్స్ చేశారు. నిమిషానికి పైగా ఉన్న టీజర్ సినిమాపై ఆసక్తి రేపుతోంది. గల్లీ రౌడీగా సందీప్ కిషన్ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. 


కామెడీ చిత్రాల దర్శకుడు జి నాగేశ్వరరెడ్డి గల్లీ రౌడీ చిత్రాన్ని తెరకెక్కించగా, కోనా వెంకట్, ఎమ్ వి వి సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఇక గల్లీ రౌడీ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. చౌరస్తా రామ్ మరియు సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. పోసాని, వైవా హర్ష వంటి నటులు మరో ఆకర్షణ. సమ్మర్ కానుకగా గల్లీ రౌడీ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతల ఆలోచనగా ఉంది. 

సందీప్ గత చిత్రం ఏ వన్ ఎక్స్ ప్రెస్ అనుకున్నంత విజయం సాధించలేదు. సందీప్ నటించిన రెండు చిత్రాలు పరాజయం పాలయ్యాయి. దీనితో గల్లీ బాయ్ మూవీతో హిట్ కొట్టాలని గట్టి సంకల్పంతో ఆయన ఉన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

14 ఏళ్ళ తర్వాత భార్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చిరంజీవి, మరి పవన్ కళ్యాణ్ ?..ఆ దర్శకుడు ఏం చేశారంటే
Gunde Ninda Gudi Gantalu: తల్లీ, కొడుకులకు చుక్కలు చూపించిన శ్రుతి.. రోహిణీతో కలిసి ప్రభావతి మరో కుట్ర