లైగర్ ట్రైలర్ రిలీజ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్. రచ్చ రచ్చ చేసిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ

Published : Jul 21, 2022, 10:23 AM IST
లైగర్ ట్రైలర్ రిలీజ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్. రచ్చ రచ్చ చేసిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ

సారాంశం

రౌడీ ఫ్యాన్స్ కు బిగ్ సర్ ప్రైజ్... విజయ్ దేవరకొండ అభిమానుల దిల్ ఖుష్ అయ్యేలా.. మాస్ దమ్ చూపించేలా లైగర్ ట్రీట్ వచ్చేసింది. ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న లైగర్ ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్  సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. 

అనుకున్న టైమ్ రానే వచ్చింది. రౌడీ ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయ్యేలా.. సిల్వర్ స్క్రీన్ మీద మాస్ మోత మోగేలా రౌడీ హీరో విజయ్ దేవరకొండ బిగ్ మాస్ ట్రీట్ తెరపై ఆవిష్క్రుతం అయ్యింది. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో అంతులేని అంచనాల మధ్య తెరకెక్కిన  లైగర్‌ మూవీ నుంచి పవర్ పుల్  ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అనుకున్నట్టుగానే  రౌడీబాయ్ అభిమానులను ఖుషి చేయడానికి మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇద్దరు. సోషల్ మీడియా వేదికగా లైగర్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 

ఇటు పూరీ జగన్నాథ్ కు , అటు హీరోగా  విజయ్‌ దేవరకొండ కు  ఫస్ట్ పాన్‌ ఇండియా మూవీ `లైగర్‌. ఈ సినిమాపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఇద్దరు. వచ్చే నెల ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.  దీంతో ప్రమోషన్‌ కార్యక్రమాల జోరు పెంచారు టీమ్. అందులో భాగంగా  సర్ప్రైజింగ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు టీమ్.  మాస్ ప్రేక్షకులు అంచనాలు ఏమాత్రం తప్పకుండా తెలుగు,తమిళ,కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో లైగర్‌ ట్రైలర్‌ని విడుదల చేశారు. అది కూడా చిరంజీవి, ప్రభాస్‌ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ అవ్వడంతో క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.  

 

ఈ రోజు ( గురువారం) ఉదయం 9.30నిమిషాలకు లైగర్‌ ట్రైలర్‌ రిలీజ్ అయ్యింది. మరోసారి మాస్ దమ్ము ఏంటో చూపించాడు రౌడీ హీరో సినిమా సత్తా ఏంటో ట్రైలర్ లో చూపించాడు. ఇక విజయ్ దేవరకొండ బాక్సార్ గా.. టెంపర్ ఉన్న క్యారెక్టర్.. నత్తి తో.. టోన్డ్ బాడీతో, బాక్సీంగ్ కింగ్ లా రచ్చ రచ్చ చేశాడు. అసలే మాస్ ఇమేజ్ ఉన్న విజయ్ ను ఊరమాస్ పాత్రలో చూపించడంలో పూరీ కష్టం కనిపిస్తుంది. ఇక బాహుబలి తరువాత రమ్యకృష్ణలోని పవర్ ఫుల్ విమెన్ ను పూరీ మరోసారి బయటకు తీశాడు. సాలా కొట్టరా అంటూ రమ్య కృష్ణ డైలాగ్ ట్రైలర్ కే హెలెట్ అయ్యింది. ఇక ఈసారి ట్రైలర్ లో హాలీవుడ్ స్టార్ .. బాక్సింగ్ కింగ్ మైక్ టైసిన్ తనదైన స్టైల్ లో సందడి చేశారు. మోత్తానికి లైగర్ ట్రైలర్ మాస్ జనాలకి.. ముఖ్యంగా రౌడీ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టిందనే చెప్పాలి. 

 

 

ఇక ఈ ట్రైలర్ ను చిరు, ప్రభాస్ తో పాటు హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని సుదర్శన్‌ థియేటర్‌లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్ లో విజయ్‌ దేవరకొండ, దర్శకుడు పూరీ జగన్నాథ్‌, ఛార్మి తొ పాటు మరికొంత మంది  పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. . అభిమానుల మధ్య ట్రైలర్‌ని థియేటర్లో రిలీజ్‌ చేయబోతుండటం తో .. భారీగా విజయ్ ఫ్యాన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.ఇక ఈ  ట్రైలర్‌ని అన్ని భాషల్లో ఒకే సారి ప్లాన్ ముంబయిలో కూడా ఈవెంట్‌ నిర్వహించబోతుండటం విశేషం. ముంబయిలో హిందీ టైలర్‌ని రణ్‌ వీర్‌ సింగ్‌, మలయాళ ట్రైలర్ని దుల్కర్‌ సల్మాన్ రిలీజ్‌ చేస్తున్నారు.

 

ఇక పూరీ జగన్నాథ్‌ రూపొందించిన లైగర్‌ సినిమా  పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీలో తెరకెక్కింది. ఇక ఈరెండు భాషలతో పాటు  తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా డబ్‌ చేసి రిలీజ్  చేయబోతున్నారు. తెలుగు సినిమాగా స్టార్ట్ అయిన ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్ తీసుకెళ్ళడం కోసం పూరీ కనెక్ట్స్ పతాకంపై ఛార్మి తో కలిసి ధర్మ ప్రొడక్షన్‌  కరణ్‌ జోహార్‌ కలిశారు. ఇక ఈమూవీలో విజయ్‌ దేవరకొండకి జోడీగా అనన్య పాండే నటిస్తుంది. ఈ ట్రైలర్ లో ఆమె డైలాగ్స్ కూడా హైలెట్ గా నిలిచాయి. ఆగస్ట్ 25న  ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ ను పలకరించనుంది లైగర్ 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌