ఫోర్బ్స్ జాబితాలో విజయ్ దేవరకొండ!

Published : Feb 04, 2019, 04:52 PM IST
ఫోర్బ్స్ జాబితాలో విజయ్ దేవరకొండ!

సారాంశం

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకొని ఘనత సాధించాడు. 2019 ఫోర్బ్స్ ఇండియా '30 అండర్ 30'లో చోటు దక్కించుకున్నారు. 

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకొని ఘనత సాధించాడు. 2019 ఫోర్బ్స్ ఇండియా '30 అండర్ 30'లో చోటు దక్కించుకున్నారు. భారత్ లో 30 ఏళ్ల కన్నా.. తక్కువ వయసుకి చెంది, తమ తమ రంగాల్లో అధ్బుత ప్రతిభని కనబరిచిన వారి జాబితాను ఫోర్బ్స్ సోమవారం నాడు విడుదల చేసింది.

ఈ లిస్ట్ లో విజయ్ స్థానం దక్కించుకున్నాడు. ఇదే జాబితాలో ప్రజాత్ కోలి(యూట్యూబర్), మేఘన మిశ్రా(సింగర్), ప్రముఖ మహిళా క్రికెటర్ స్మృతి మంధాస, ప్రముఖ అథ్లెట్ హిమాదాస్ లు చోటు దక్కించుకున్నారు.

గతేదాడిలో విజయ్ నటించిన 'టాక్సీవాలా' విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం 'డియర్ కామ్రేడ్' సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు. అలానే క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 

వరుస విజయాలతో దూకుడు మీదున్న ఈ నటుడు ఇటీవల తన రెమ్యునరేషన్ కూడా పెంచి ఇప్పుడు రూ.10 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.  

PREV
click me!

Recommended Stories

Ee Nagaraniki Emaindhi 2: శ్రీనాథ్ మాగంటికి బంపర్‌ ఆఫర్‌, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో ఛాన్స్.. పాత్ర ఇదే
Divi Vadthya: లవ్ బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లా, మళ్లీ ఆ కష్టాలు రావద్దు.. నటి దివి వద్త్య ఎమోషనల్‌