
తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ‘బిచ్చగాడు’ సినిమాతో అనూహ్యంగా పేరు తెచ్చుకున్న సంగీత దర్శకుడు, నటుడు విజయ్ ఆంటోని తాజాగా ‘ఇంద్రసేన’ చిత్రంలో నటిస్తున్నాడు. గతంలో డాక్టర్ సలీమ్, నకిలీ చిత్రంలో నటించినప్పటికీ పెద్దగా పేరు తెచ్చుకోలేక పోయాడు ఆంటోని. ఇక బిచ్చగాడు సినిమాతో తమిళ డబ్బింగ్ చిత్రమైనా సూపర్ డూపర్ హిట్ కొట్టడమే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా రికార్డు సృష్టించాడు. ఆ మద్య వచ్చిన యమన్ చిత్రం కూడా మంచి సక్సెస్ సాధించింది. దీంతో విజయ్ ఆంటోని తమిళ హీరో అయినప్పటికి తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.
ప్రస్తుతం సి శ్రీనివాస్ దర్శకత్వంలో ఇంద్రేసేన అనే చిత్రాన్ని చేస్తున్నాడు విజయ్ ఆంటోని. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ని మెగాస్టార్ చిరంజీవి విడుదల. ఇక ఫస్ట్ లుక్ లో విజయ్ ఆంటోని లుక్ స్టన్నింగ్‌గా ఉంది. పోస్టర్ లాంచింగ్ కార్యక్రంలో రాధిక, విజయ్ ఆంటోనిలతో పాటు చిత్ర బృందం హాజరైంది. జి. శ్రీనివాసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మాజీ హీరోయిన్ రాధికా శరత్ కుమార్ ఒక నిర్మాత కావడం విశేషం.
తెలుగు , తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని సినిమారంగంలో అసలు సిసలైన ఇంద్ర మెగాస్టార్ చిరంజీవి కాబట్టి ఆయన చేతుల మీదుగా చేయడం సంతోషంగా ఉందని అన్నారు రాధికా శరత్ కుమార్. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. తన స్నేహితురాలు రాధికతో కలిసి తాను ఎన్నో చిత్రాల్లో నటించానని, రాధిక నిర్మిస్తున్న చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉందన్నారు.విజయ్ ఆంటోనీ చేసిన బిచ్చగాడు తెలుగులో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. కొత్త కొత్త కథలతో వస్తున్న చిత్రాలు మంచి విజయాన్ని సాధిస్తున్నాయి, ఈ ఇంద్రసేన కూడా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు .