సినిమాకు సూపర్ టాక్.. కానీ కలెక్షన్సే షాక్

By AN TeluguFirst Published Jun 8, 2019, 11:43 AM IST
Highlights

పాపులారిటీ తెచ్చుకోవటం కష్టం. కానీ పోగొట్టుకోవటం ఈజీ. 

పాపులారిటీ తెచ్చుకోవటం కష్టం. కానీ పోగొట్టుకోవటం ఈజీ. విజయ్ ఆంటోని పరిస్దితి అదే. తెలుగులో అతనికి బిచ్చగాడుతో ఓ రేంజి పాపులారిటి వచ్చింది. అప్పట్లో  ఊరు పేరు లేని ఓ హీరో నటించి ఓ చిన్న డబ్బింగ్  సినిమా సంచలన విజయం సాధించి అందరికీ షాక్ ఇచ్చింది.  

ఆ ఊపులో  బిచ్చగాడు సినిమా హిట్ తర్వాత విజయ్ ఆంటోని ప్రతీ సినిమా ఇక్కడ రిలీజైంది. మంచి బిజినెస్సే జరిగింది. ప్రేక్షకులు సైతం చాలా ఆసక్తిగా థియోటర్స్ కు వెళ్లారు. అయితే ప్రతీ సినిమా దెబ్బ కొట్టింది. దాంతో జనాలు నమ్మటం మానేసారు. ఇప్పుడు ఓ హిట్ సినిమా వచ్చినా జనం ప్రక్కన పెట్టేసారు. 

విజయ్ ఆంటోని, యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రల్లో న‌టించిన తాజా తమిళ చిత్రం  ‘కొలైగార‌న్’. ఆండ్రూ లూయిస్ దర్శకత్వంలో  అషిమా హీరోయిన్ గా చేసిన ఈ చిత్రాన్ని దియా మూవీస్ నిర్మించింది. ఈ చిత్రాన్ని పారిజాత మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై టి.న‌రేష్ కుమార్- టి.శ్రీ‌ధ‌ర్ ‘కిల్లర్’ పేరుతో తెలుగులో అనువాదం చేసి విడుద‌ల చేసారు. మ‌ర్డర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కిన  ఈ సినిమా టీజ‌ర్, ట్రైలర్ మంచి రెస్పాన్సే  రాబట్టుకున్నాయి. అయితే నిన్న విడుదలైన ఈ సినిమాకు ఓపినింగ్స్ మినిమం ఓపినింగ్స్  తెచ్చుకోలేకపోయింది. 

సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ మెచ్చుకున్నారు. పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. కానీ ఫలితం లేదు. ఈ మాదిరి రెస్పాన్స్ వేరే సినిమాకు వచ్చి ఉంటే థియోటర్స్ దద్దరిల్లేవి. దానికి తోడు నిర్మాతలు పబ్లిసిటీ కూడా పెంచలేదు.

click me!