పోలీసులను ఆశ్రయించిన పూరి.. కారణమేంటంటే..?

Published : Jun 08, 2019, 10:54 AM IST
పోలీసులను ఆశ్రయించిన పూరి.. కారణమేంటంటే..?

సారాంశం

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. రామ్ హీరోగా 'ఇస్మార్ట్ శంకర్' సినిమాను రూపొందిస్తున్నాడు. 

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. రామ్ హీరోగా 'ఇస్మార్ట్ శంకర్' సినిమాను రూపొందిస్తున్నాడు. ఇటీవల విడుదలైన సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశకి చేరుకుంది.

ఈ క్రమంలో చిత్రయూనిట్ కి ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమా పూర్తి స్క్రిప్ట్ ని మురళి కృష్ణ అనే వ్యక్తి బజ్ బాస్కెట్  (Buzz Basket) ఇన్స్టాగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేశాడు. స్క్రిప్ట్ ని ఇన్స్టాగ్రామ్ నుండి తీయడానికి ఇస్మార్ట్ శంకర్ చిత్రయూనిట్ నుండి డబ్బు డిమాండ్ చేశాడు.

దీంతో నిర్మాణ సంస్థలు పూరి జగన్నాథ్ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ తరఫున రవి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. 

ఈ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్పటికే షురూ చేశారు. తాజాగా ఓ మాస్ సాంగ్ ని కూడా విడుదల చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Toxic Cast Remuneration: రెమ్యూనరేషన్‌లో యష్‌ కి నయనతార గట్టి పోటీ.. టాక్సిక్ స్టార్ల జీతాల వివరాలు
Sridivya without Makeup: మేకప్ లేకుండా నేచురల్‌ అందంతో కట్టిపడేస్తున్న శ్రీదివ్య.. లేటెస్ట్ ఫోటోలు