కోలీవుడ్ లో భారీ మల్టీ స్టారర్ కు ప్లాన్, విజయ్‌-విక్రమ్ కలయికలో సినిమా..? క్లారిటీ ఇచ్చిన హీరో

Published : Sep 04, 2022, 07:34 AM IST
కోలీవుడ్ లో భారీ మల్టీ స్టారర్ కు ప్లాన్, విజయ్‌-విక్రమ్ కలయికలో సినిమా..? క్లారిటీ ఇచ్చిన హీరో

సారాంశం

కొన్ని కొన్ని కొన్ని కాంబినేషన్స్ లు ఎవరి ఊహించనివిగా ఉంటాయి..? సడెన్ గా తెరపైకి వచ్చి సందడి చేస్తాయి. అభిమానులకు పెద్ద సర్ ప్రైజ్ లను ఇస్తాయి. అలాంటి కాంబినేషన్ కలవబోతోంది సౌత్ లో.. 

చియాన్ విక్రమ్, దళపతి విజయ్ ఇద్దరూ స్టార్ హీరోలే కోలీవుడ్ లో.. ఒక్క తమిళ్ లోనే కాదు సౌత్ అంతా వారికి స్టార్ ఇమేజ్ ఉంది. ఇక వీరిద్దరి సినిమాలు హిట్ అయినా.. ప్లాప్ అయినా వారి ఇమేజ్ మాత్రం పెరుగుతుంది కాని తరగడంలేదు. ఈక్రమంలో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా  వస్తే ఎలా ఉంటుంది అని ఫ్యాన్స్ చాలా మంది అనుకుని ఉంటారు. వారి కల త్వరలో నెరవేరబోతోంది. 

విక్రమ్ హీరోగా తెరకెక్కిన  కోబ్రా  సినిమా రీసెంట్ గా  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమా.. రీ బడ్జెట్ తో తెరకెక్కి.. భారీ అంచాల నడుమ రిలీజ్ అయ్యింది.  విక్రమ్ స్థాయిలో రూపొందిన ఈమూవీ ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది.  ఈ సినిమాలో విక్రమ్ పడ్డ కష్టానికి తగిన ఫలితం దక్కలేదు. దాదాపు  7 డిఫరెంట్ గెటప్స్ లో విక్రమ్ ఈసినిమాలో నటించారు. కథాకథనాల పరంగా కోబ్రా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక తమిళనాడులో కూడా ఈ సినిమా ఇదే టాక్ ను తెచ్చుకుంది.

ఇక రీసెంట్ గా ఈ సినిమా రిలీజ్ సందర్భంగా.. మీడియాతో మాట్లాడారు విక్రమ్. ఈ సందర్భంలోనే  కోలీవుడ్ లో మరో స్టార్ హీరో విజయ్ ప్రస్తవన వచ్చింది.  విజయ్ స్టయిల్ .. ఆయన డైలాగ్ డెలివరీ.. డాన్స్ అంటే తనకి ఎంతో ఇష్టమని విక్రమ్ చెప్పారు. ఆయనతో ఒక మల్టీస్టారర్ చేయాలనే ఆశతో ఉన్నానని అన్నారు. భవిష్యత్తులో తమ కాంబినేషన్లో ఒక సినిమా ఉంటుందని హింట్ ఇచ్చారు విక్రమ్. చాలా కాలంగా వీరిద్దరి కాంబోలో సినిమా ఉంటుందన్న మాట.. కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్ లో గట్టిగా వినిపిస్తూ ఉండేది. దానిపై విక్రమ్ స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో.. ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 

అంతే కాదు విక్రమ్ మరో బాంబ్ పేల్చారు.. తమ కాంబినేషన్లో తెరకెక్కబోయే మల్టీ స్టారర్ మూవీకి  అజయ్ జ్ఞానముత్తునే దర్శకత్వం వహిస్తాడని అన్నారు. ఈ విషయంలో రకరకాల  వాదనలు వినిపిస్తున్నారు నెటిజ్లు. ముందే వీరి కాంబోలో అజయ్ కథ రెడీ చేసుకుని ఉంటాడు. ఆ కథ నచ్చడంతో విక్రమ్  ఈ ప్రపోజల్ ను ఈ రకంగా తీసుకువచ్చారంటూ.. కోలీవుడ్ సర్కిల్ లో చర్చ నడుస్తోంది. మరి ఈ ప్రపోజల్ కు విజయ్ ఏమంటాడో చూడాలంటూ.. కామెంట్ చేస్తున్నారు సోషల్ మీడియా జనాలు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్