బ్రహ్మానందంపై విద్యుల్లేఖ కామెంట్,ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

Surya Prakash   | Asianet News
Published : Sep 18, 2020, 03:28 PM IST
బ్రహ్మానందంపై  విద్యుల్లేఖ కామెంట్,ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

సారాంశం

  గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసి ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను నవ్విస్తున్న సీనియర్ కమెడియన్ షో ని తక్కువ చేసి మాట్లాడతావా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.


తమిళంలోనే కాదు, తెలుగులోనూ కమిడియన్ గా విద్యుల్లేఖ రామన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.  అతి తక్కువ కాలంలోనే లేడీ కమెడియన్ గా విద్యుల్లేఖ తనదైన ముద్రను వేసుకుంది. ఈ మధ్య కాలంలో వరసపెట్టి సినిమాలు చేసిన  ఆమె  ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది... స్టార్ కమెడియన్ గా  గుర్తింపు తెచ్చుకుంది. అలాగే కాస్తంత లావుగా, బొద్దుగా ఉండే ఈమె లాక్ డౌన్ లో స్లిమ్ గా మారి అందరిని షాక్ ఇచ్చింది. 

అంతేనా సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకొని తనకు కాబోయే భర్తని పరిచయం చేసింది.  ఈ తెలిసిన విషయాలన్ని ప్రక్కన పెడితే ఆమె  అమెజాన్  ప్రైమ్ లో స్టాండప్ కామెడీ షో చేస్తోంది. చెయ్యనివ్వండి అంటారా...అయితే ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వూలో  హాస్యబ్రహ్మ బ్రహ్మానందం స్టాండప్ కామెడీ పెద్దగా  వర్కౌట్ కాలేదని కామెంట్స్ చేసింది.

వివరాల్లోకి వెళితే..  విద్యుల్లేఖ రామన్ - అబీష్ మాథ్యూలతో అమెజాన్ ప్రైమ్ 'కామిక్ స్థాన్ సెమ్మ కామెడీ పా' అనే స్టాండప్ కామెడీ షో  ప్లాన్ చేసింది. అర్జున్ కార్తికేయన్ దర్శకత్వం వహిస్తున్న ఈ కామెడీ షో తమిళంలో ఉంటుంది.  ఈక్రమంలో ఈ షోని ప్రమోట్ చేసుకునేందుకు కొన్ని ఇంటర్వూలు ఇచ్చింది. 

ఆమె మాట్లాడుతూ.. బ్రహ్మానందం చేసిన స్టాండప్ కామెడీ షో చూశాను. ప్రజంటేషన్ సరిగా లేదు. స్టాండప్‌ కామెడీకి కావాల్సిన కంటెంట్‌ను సరిగా తీసుకోలేదు. సరిగా హోంవర్క్ చేయలేదనే అభిప్రాయం కలిగింది. కేవలం స్టాండింగ్ కామెడీ‌లోని బేసిక్ కంటెంట్‌ను వారు తీసుకొన్నారని అనిపించింది. అందుకే అది హిట్ కాలేదు. అయితే కామిక్‌స్థాన్‌ తమిళ్‌లో కంటెంట్‌ను జాగ్రత్తగా హ్యాండిల్ చేశారు. మా షో ప్రేక్షకులను ఆకట్టుకొంటుందన్న నమ్మకం నాకు ఉంది. బ్రహ్మానందం షోను మా షోను పోల్చి చూడకూడదు అని విద్యుల్లేఖ రామన్ అని అంది. 

ఈ కామెంట్స్ తో తెలుగు వాళ్లకు బాగా కాలింది.  గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసి ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను నవ్విస్తున్న సీనియర్ కమెడియన్ షో ని తక్కువ చేసి మాట్లాడతావా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode : దీప కు చెక్ పెట్టడానికి జ్యోత్స్న మాస్టర్ ప్లాన్, శ్రీధర్ బెయిల్ విషయంలో కార్తీక్ కు పోలీసుల షాక్
OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్