
ప్రస్తుతం విద్యాబాలన్ కహానీ-2' సినిమా ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉంది.కహానీ-2' సినిమా ప్రమోషన్‌లో గ్లామర్ గురించి మాట్లాడుతూ, ప్రస్తుతానికి గ్లామరస్ పాత్రలు చేయాలనే ఉద్దేశ్యం లేదని చెబుతూనే, తెరపై గ్లామరస్‌గా కన్పించాల్సి వస్తే.. కథ అంతలా డిమాండ్ చేస్తే తన ఆలోచనలు మారతాయని చెప్పిన విద్యాబాలన్, 'తుమ్‌హారీ సులు' సినిమాలో హాట్ అప్పీల్ పండిస్తానని చెప్పకనే చెప్పేసింది.
. ఈ సినిమాలో ఆమె పాత్ర ఓ లేట్ నైట్ షోకి యాంకర్‌గా పనిచేస్తుందట..అంటే మళ్లి అందాలను తెరపై చూపించడానికి సిద్దమైనట్లేనని అభిమానులు ఆనందపడుతున్నారు. 'తుమ్‌హారీ సులు' , సినిమాలో తన పాత్ర చాలా 'చిలిపి'గా వుంటుందని చెప్పింది. కొంచెం హాట్‌గా కొంచెం నాటీగా తన పాత్రని దర్శకుడు రాసుకున్నాడనీ, తన కెరీర్‌లో ఇదొక డిఫరెంట్ ఫిలిం అవుతుందని చెప్పుకొచ్చింది విద్యాబాలన్. వచ్చే ఏడాది డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు విద్యాబాలన్ తెలిపింది.