
స్టార్ హీరోయిన్ విద్యా బాలన్ కు షాక్ తగిలినంత పని అయ్యింది. ఆన్‌లైన్‌లో ఆమె డీప్ ఫేక్ వీడియో ఒకటి చక్కర్లు కొట్టింది. ఈ వీడియో పై స్వయంగా స్పందించింది విద్యా బాలన్, తన డీప్‌ఫేక్ వీడియో గురించి. టెక్నాలజీని, మేధస్సును ఇలా దుర్వినియోగం చేనయడంపై ఆమె సీరియస్ అయ్యింది. ఈ విషయంలో యాక్షన్ తీసుకున్నారు విద్య. ఈ ఫేక్ వీడియో గురించి తన ఫాలోవర్స్‌కు వార్నింగ్ ఇవ్వడానికి ఆమె మరో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు తనకు ఎలాంటి సంబంధం లేదని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో క్లారిటీ ఇచ్చారు.
స్టేట్ మెంట్ ఇచ్చిన విద్యాబాలన్
డీప్‌ఫేక్ వీడియోతో పాటు ఒక స్టేట్‌మెంట్ షేర్ చేసిన విద్యా, “నేను కనిపిస్తున్న చాలా వీడియోలు సోషల్ మీడియా, వాట్సాప్‌లో వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ వీడియోలు AIతో తయారైనవి, ఫేక్ అని నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ వీడియోలను చేసి, షేర్ చేయడంలో నా పాత్ర ఏమీ లేదు. ఇలాంటి వాటిని నేను ఏ విధంగానూ సపోర్ట్ చేయను” అని తేల్చి చెప్పారు.
ఇలాంటి విషయాలను షేర్ చేసే ముందు జాగ్రత్తగా ఉండమని, దాని గురించి కన్ఫర్మ్ చేసుకోవాలని విద్యా తన అభిమానులకు రిక్వెస్ట్ చేశారు. "ఈ వీడియోలో చేసిన ఏ స్టేట్‌మెంట్స్‌ను నాతో పోల్చకండి, ఎందుకంటే అది నా అభిప్రాయాలు లేదా పనిని చూపించదు. వీడియోను షేర్ చేసే ముందు సమాచారాన్ని కన్ఫర్మ్ చేసుకోండి. ఇలాంటి తప్పుదోవ పట్టించే AIతో తయారైన వాటి గురించి జాగ్రత్తగా ఉండాలని నేను అందరినీ కోరుతున్నాను” అని రాసుకొచ్చారు.
చాలా నిజంగా ఉన్నట్లుగా ఫేక్ విషయాన్ని నిజమని చూపించడానికి వీలయ్యే డీప్‌ఫేక్ టెక్నాలజీని సెలబ్రిటీలను టార్గెట్ చేస్తున్నారు. రష్మిక మందన్న, ఆలియా భట్, దీపికా పదుకొణె, కత్రినా కైఫ్, అమీర్ ఖాన్, రణవీర్ సింగ్ లాంటి చాలా మంది ఇండియన్ సినిమా స్టార్లు ఇలాంటి మోసాలకు బలయ్యారు.
'ఇక విద్యా బాలన్ చివరిసారిగా కార్తీక్ ఆర్యన్, మాధురి దీక్షిత్, తృప్తి డిమ్రిలతో కలిసి 'భూల్ భులయ్యా 3' సినిమాలో కనిపించారు. గత సంవత్సరం దీపావళికి రిలీజైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది.