
సోనూ సూద్ ఒక స్టార్ సెలబ్రిటీ. సినిమాల్లో విలన్ గా నటించినా..? నిజ జీవితంలో మాత్రం హీరోనే. కరోనా టైంలో చాలా మందికి సహాయం చేశాడు. చదువు కోసం పేదలను ఆదుకున్నాడు. ఉపాధికోస ఎదురుచూస్తున్నవారికి దన సాయం చేశాడు. ఇప్పుడు కూడా సోనూ సూద్ సహాయం చేస్తూనే ఉన్నాడు.
ఈ మధ్య సోనూ సూద్ ఒక వీధి పక్కన బండి దగ్గరికి వెళ్ళి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 15 రూపాయలకే దోసె, 35 రూపాయలకే ఇడ్లీ అమ్మే టిఫిన్ బండిదగ్గరకు సోనూ సూద్ వెళ్ళాడు. చెన్నైలో శాంతి అనే మహిళ ఒక చిన్న బండిలో ఉదయం టిఫిన్ అమ్ముతుంది. సోనూ సూద్ చెన్నైకి వెళ్ళినప్పుడు ఆ బండి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ 2 ఇడ్లీలు, వడ తిన్నాడు. 35 రూపాయలకే డిస్కౌంట్ ఉందా అని అడిగాడు. ఆమె వెంటనే 5 రూపాయలు తగ్గించి 30 రూపాయలకే ఇస్తాను అంది.
ఈ వీడియోను సోనూ సూద్ షేర్ చేశాడు. శాంతి ఆంటీ బండిలో ఇడ్లీ, వడ, దోసె, చట్నీ, సాంబార్ అన్నీ ఉన్నాయని చూపించాడు. ఇక్కడ అన్నీ చాలా రుచిగా ఉంటాయని సోనూ సూద్ చెప్పాడు. శాంతి ఆంటీ చిన్న హోటల్లో టిఫిన్ తిని సోనూ సూద్ ఇంకో సర్ ప్రైజ్ ఇచ్చాడు.
సోనూ సూద్ తన టీమ్ కోసం అదే బండిదగ్గర దోసెలు వేశాడు. ఆమె దగ్గర పిండి తీసుకుని దోసెలు వేసి తన టీమ్ కి ఇచ్చాడు. దోసెలు కేవలం 15 రూపాయలు మాత్రమే. సోనూ సూద్ స్వయంగా దోసెలు వేసి తన టీమ్ కి పంచాడు. తను తిన్న ఇడ్లీ వడ, తన టీమ్ తిన్న దోసెలకు డబ్బులు ఇచ్చాడు. సోనూ సూద్ రావడం వల్ల శాంతి ఆంటీ హోటల్ బాగా ఫేమస్ అయింది. ఇప్పుడు చాలా మంది శాంతి ఆంటీ హోటల్ కి వచ్చి టిఫిన్ చేస్తున్నారు. సోనూ సూద్ ఇలా వీధి పక్కన బండ్ల దగ్గరికి వెళ్లడం ఇదే మొదటిసారి కాదు. చాలాసార్లు ఇలా చేశాడు. లాస్ట్ ఇయర్ హైదరాబాద్ లో కుమారి ఆంటీ బండి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ చాలా రకాల వంటలు తిన్నాడు.
రీల్ విలన్ కాస్త రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూ సూద్. చేతికి ఎముకలేదన్నంతగా దానాలు చేస్తూ.. రీసెంట్ గా కూడా ఓ వృద్థ కళాకారుడిని ఆదుకుని మరో సారి మంచి మరసు చాటుకున్నాడు. అటువంటిది.. చాలా మంది జనాలు దేవుడిగా భావించే సోనూసూద్.. నలుగురికి ఆదర్శంగా మారాడు. దేశంలో చాలా చోట్ల సోనూ సూద్ కు గుళ్లు కూడా కట్టారు. కరోనా కష్టకాలంలో తన పెద్ద మనసు చాటుకుని.. తన వంతు గా చాలామందికి సహాయం చేశాడు సోనూ సూద్. బాలీవుడ్ స్టార్ యాక్టర్ , రియల్ హీరో సోనూసూద్.. తన సంసాదనలో చాలా వరకూ.. ఇలా సాయం చేయడానకి ఉపయోగించాడు.