నెక్స్ట్ సీజన్ లో అలాంటివి ఉండవు.. రానా నాయుడులో బోల్డ్ సీన్స్ పై వెంకటేష్ ఫస్ట్ రియాక్షన్

By Asianet NewsFirst Published May 31, 2023, 11:50 AM IST
Highlights

దగ్గుబాటి హీరోలు రానా, విక్టరీ వెంకటేష్ కలసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు. కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ మార్చి 10 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ మొదలైంది.

దగ్గుబాటి హీరోలు రానా, విక్టరీ వెంకటేష్ కలసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు. కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ మార్చి 10 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ మొదలైంది. ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న వెంకటేష్ తన ఇమేజ్ కి భిన్నంగా ఈ వెబ్ సిరీస్ లో నటించారు. 

బోల్డ్ సన్నివేశాలు, డైలాగులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వెంకటేష్ పాత్రపై కొందరు ఆడియన్స్ పెదవి విరిచారు. ఆల్రెడీ ఈ బోల్డ్ సీన్స్ పై రానా దగ్గుబాటి స్పందించారు. రానా నాయుడు వెబ్ సిరీస్ ఫ్యామిలీ ఆడియన్స్ చూడాలంటే కొంత ఇబ్బందే అని తెలిపారు. 

సురేష్ బాబు చిన్న కుమారుడు అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం అహింస. తేజ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. జూన్ 2న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండడంతో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తన సోదరుడి కుమారుడి చిత్రం కోసం వెంకటేష్ రంగంలోకి దిగాడు. 

రీసెంట్ గా అహింస ప్రెస్ మీట్ లో వెంకటేష్ పాల్గొనగా.. మీడియా ప్రతినిధులు ఆయన్ని రానా నాయుడు వెబ్ సిరీస్ లో అభ్యంతరకర సన్నివేశాల గురించి ప్రశ్నించారు. దీనిపై వెంకటేష్ స్పందిస్తూ.. రానానాయుడు సిరీస్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే బోల్డ్ సీన్స్ గురించి ఆలోచిస్తూ ఉండడం కంటే ముందుకు వెళ్లడమే మంచిది. 

అయితే ఫస్ట్ సీజన్ లో కొన్ని సీన్స్ ప్రభావం చూపిన మాట వాస్తవమే. నెక్స్ట్ సీజన్ మాత్రం అందరికి నచ్చే విధంగానే ఉంటుంది అని వెంకటేష్ హామీ ఇచ్చారు. మొదటి సీజన్ కంటే రెండవ సీజన్ కి ఆడియన్స్ పెరుగుతారు అని అన్నారు. 

 

click me!