నటనకు సమంత బ్రేక్.. ప్రెగ్నెన్సీ కారణమా..?

Published : Aug 16, 2019, 09:57 AM ISTUpdated : Aug 16, 2019, 10:58 AM IST
నటనకు సమంత బ్రేక్.. ప్రెగ్నెన్సీ కారణమా..?

సారాంశం

పాకెట్‌ మనీ కోసం చిన్నచిన్న వేడుకల్లో సహాయ కార్యక్రమాలు చేస్తూ నటిగా మారింది ఈ బ్యూటీ. బానాకాత్తాడి చిత్రంతో హీరోయిన్‌గా రంగప్రవేశం చేసినా, తెలుగులో నటించిన ఏ మాయచేసావే చిత్రంతో విజయాన్ని అందుకుంది. తరువాత తెలుగు, తమిళం భాషల్లో స్టార్‌ హీరోలతో నటిస్తూ హిట్‌ చిత్రాల నాయకిగా రాణిస్తున్నారు.

తెలుగు, తమిళ భాషల్లో నటించి స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన సమంత దాదాపు అగ్ర హీరోలదంరి సరసన నటించింది. నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత లేడీ ఓరియెంటెడ్ కథలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. ఇటీవల 'ఓ బేబీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ మంచి సక్సెస్ ని అందుకుంది. ఇది ఇలా ఉండగా.. సమంత గర్భం దాల్చినట్లు, దీంతో నటన కు సుమారు ఏడాదిన్నర బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్న సమంత కొత్త సినిమాలను అంగీకరించడం లేదనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె నటిస్తోన్న '96' సినిమా తరువాత మరో సినిమాను అంగీకరించలేదని నిజమే.. అయితే ఈ విషయంపై నటి సమంత స్పందించలేదు. కానీ మంచి విజయాలతో దూసుకుపోతున్న ఈ సమయంలో సమంత సినిమాలకు బ్రేక్ ఇస్తుందని భావించలేం.

ఇప్పుడిప్పుడే లేడీ ఓరియెంటెడ్ సినిమాల హీరోయిన్ గా పేరు తెచ్చుకుంటోంది... ఇకపై కూడా వైవిధ్యభరితే కథా చిత్రాల్లో నటించాలనుకుంటున్నట్లు ఇటీవల సమంత తెలిపారు. అలాంటిది పిల్లలను కనాలనే ఆలోచన ఇప్పుడే తీసుకుంటారని కూడా ఊహించలేం. 

ప్రస్తుతం ఈ బ్యూటీ తన రెమ్యునరేషన్ కూడా పెంచేసింది. ఇలాంటి సమయంలో నటనకు బ్రేక్ ఇవ్వాలని ఎవరూ అనుకోరు. అలాంటిది సమంత గురించి ఇలాంటి ప్రచారం జరగడానికి కారణం తెలియరావడం లేదు.మరి ఈ విషయంపై సమంత ఎలా స్పందిస్తుందో చూడాలి!
 

PREV
click me!

Recommended Stories

Rashmika Mandanna: ఫ్రెండ్స్ తో శ్రీలంక ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న రష్మిక, ఇది బ్యాచిలరేట్ పార్టీనా ?
Director KK Passed Away: నాగార్జున `కేడి` మూవీ డైరెక్టర్‌ కన్నుమూత.. సందీప్‌ రెడ్డి వంగాకి ఈయనే గురువు