సీనియర్ నటుడు వంకాయల సత్యనారాయణ కన్నుమూత

First Published Mar 12, 2018, 3:28 PM IST
Highlights
  • సీనియర్ నటుడు వంకాయల సత్యనారాయణ కన్నుమూత
  • సూత్రదారులు, సీతా మహాలక్ష్మి, ఊరికిచ్చిన మాట, శ్రీనివాస కళ్యాణం తదితర చిత్రాల్లో నటించిన  వంకాయల
  • వందలాది సినిమాలతో పాటు టీవీ కార్యక్రమాల్లో నటించిన వంకాయలో

ప్రముఖ తెలుగు సినీయర్ నటుడు వంకాయల సత్యనారాయణ మృతి చెందారు. కొంతకాలంగా శ్వాస సంబంధిత అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన సోమవారం కన్నుమూశారు. సత్యనారాయణ వయసు 78 సంవత్సరాలు. వంకాయల సత్యనారాయణ డిసెంబర్ 28, 1940లొ విశాఖపట్నంలో జన్మించారు. నటన మీద ఆసక్తితో సినిమా రంగం వైపు వచ్చిన ఆయన అనేక చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించారు. నటనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వంకాయల సత్యనారాయణ కెరీర్లో దాదాపు 180పైగా సినిమాలు, పలు టీవీ సీరియల్స్‌లో నటించారు.

 

సినిమాల్లోకి రాక ముందు ఆయన చదువు, స్పోర్ట్స్‌లో మంచి ప్రతిభ కనబరిచేవారు. బికాంలో గోల్డ్ మెడల్ అందున్నారు. 1960 ఆగస్టులో షూటింగ్‌ కాంపిటీషన్‌లో భారతదేశంలోనే మొదటి స్థానం పొందారు. చదువు, ఆటల్లో ఆయన ప్రతిభకు హిందుస్థాన్ షిప్‌యార్డులో మంచి ఉద్యోగం వచ్చినప్పటికీ ఉద్యోగం కన్నా నటనరంగమే ముఖ్యమని భావించినా సత్యనారాయణ సినిమాల వైపు అడుగులు వేశారు. 'నీడలేని ఆడది' సినిమా ద్వారా వంకాయల సత్యనారాయణ తన సినిమా కెరీర్ ప్రారంభించారు. సూత్రదారులు, సీతా మహాలక్ష్మి, దొంగకోళ్లు, ఊరికి ఇచ్చిన మాట, విజేత, శ్రీనివాస కళ్యాణ్ లాంటి చిత్రాలు వంకాయల సత్యనారాయణకు మంచి పేరు తెచ్చాయి.

click me!