ప్రముఖ బాలీవుడ్ నటుడు మృతి!

Published : Jun 05, 2019, 12:13 PM IST
ప్రముఖ బాలీవుడ్ నటుడు మృతి!

సారాంశం

బాజీగర్, 36 చైనా టౌన్‌, ఖిలాడీ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన బాలీవుడ్ సీనియర్ నటుడు, ప్రద్మశ్రీ అవార్డు గ్రహీత దిన్యార్ కాంట్రాక్టర్(79) మృతి చెందారు. 

బాజీగర్, 36 చైనా టౌన్‌, ఖిలాడీ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన బాలీవుడ్ సీనియర్ నటుడు, ప్రద్మశ్రీ అవార్డు గ్రహీత దిన్యార్ కాంట్రాక్టర్(79)మృతి చెందారు.

వయసు రీత్యా వచ్చిన ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. హిందీ, గుజరాతీ సినిమాలతో పాటు పలు టీవీ షోలలో కూడా ఆయన నటించారు.

నటన మీద ఆసక్తితో చదువుకునే రోజుల్లోనే రంగస్థల నటుడిగా కెరీర్ ఆరంభించిన ఆయన 1966 నుండి సినిమాల్లో నటిస్తున్నారు. సినిమా రంగానికి ఆయన చేసిన సేవలకు 2019లో భారత ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఆయన మరణ వార్త విన్న ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?