' సైరా' కు సైడిచ్చి.. ముందుకు కదిలిన వెంకీమామ

By Prashanth MFirst Published Sep 7, 2019, 1:30 PM IST
Highlights

సైరా లాంటి భారీ ఎక్సపెక్టేషన్స్ ఉన్న  సినిమాతో పోటి పడే కన్నా సినిమాను కాస్త వాయిదా వేయటం బెటర్ అని భావించారు. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు దీపావళి కానుకగా అక్టోబర్ 25 న విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. త్వరలోనే ఈ మేరకు అఫీషియల్ ఎనౌన్సమెంట్ రానుంది.

విక్టరీ హీరో వెంకటేష్‌, అక్కినేని వారసుడు నాగచైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న ఫన్ ఎంటర్‌టైనర్‌ వెంకీ మామ. తొలిసారిగా నిజ జీవిత  మామ అల్లుళ్లు కలిసి నటిస్తున్న సినిమా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా సురేష్ ప్రొడక్షన్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది.

ఎన్టీఆర్ తో లవకుశ వంటి చిత్రం తీసి హిట్ కొట్టిన బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ముందుగా అక్టోబర్‌ 4న రిలీజ్ చేయాలని భావించారు. అయితే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2న రిలీజ్ చేయాలని ఫిక్స్‌ అయ్యారు.అయితే  సైరా లాంటి భారీ ఎక్సపెక్టేషన్స్ ఉన్న  సినిమాతో పోటి పడే కన్నా సినిమాను కాస్త వాయిదా వేయటం బెటర్ అని భావించారు. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు దీపావళి కానుకగా అక్టోబర్ 25 న విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. త్వరలోనే ఈ మేరకు అఫీషియల్ ఎనౌన్సమెంట్ రానుంది.

సురేశ్‌ ప్రొడక్షన్స్, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకటేశ్‌ సరసన పాయల్‌ రాజ్‌పుత్, నాగచైతన్యకు జోడీగా రాశీఖన్నా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కేఎస్‌ రవీంద్ర (బాబి) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కథ ని .. భాగవతంలోని కంసుడు, చిన్ని కృష్ణుడు పాత్రల నేపధ్యాలను తీసుకుని ఈ కథను అల్లినట్లు సమాచారం.

తన మేనల్లుడు చేతిలో తనకు మరణం ఉందని జాతకాలతో  పుట్టినప్పుడే తెలుసుకుని విడిపోయి...మళ్లీ పెద్దయ్యాక కలిసిన మామా-అల్లుడు కథ అని తెలుస్తోంది. జనార్దన మహర్షి చేసిన ఈ కథను కోన వెంకట్, దర్శకుడు బాబి కలిసి డవలప్ చేసారట.  

click me!