`కంచరపాలెం` టీం నుంచి `కనబడుట లేదు`

By Satish ReddyFirst Published Jul 27, 2020, 10:40 AM IST
Highlights

కనబడుట లేదు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో క‌థానాయ‌కుడు  సుక్రాంత్ వీరెళ్ల ఒక తాడుకు వేలాడ‌గ‌ట్టిన కొన్ని ఫొటోల వంక సీరియ‌స్‌గా చూస్తుండ‌టం ఉత్కంఠ‌ రేకెత్తిస్తోంది. త్వ‌ర‌లో టీజ‌ర్‌ను రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

బాల‌రాజు ర‌చ‌న చేస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న స‌స్పెన్స్ అండ్ ల‌వ్ థ్రిల్ల‌ర్ 'క‌న‌బ‌డుట‌లేదు'. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను సోమ‌వారం ఉద‌యం 09:09 గంట‌ల‌కు కేరాఫ్ కంచరపాలెం, ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య చిత్ర‌ ద‌ర్శ‌కుడు వెంక‌టేష్ మ‌హా, హీరో స‌త్య‌దేవ్‌లు సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.

ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో క‌థానాయ‌కుడు  సుక్రాంత్ వీరెళ్ల ఒక తాడుకు వేలాడ‌గ‌ట్టిన కొన్ని ఫొటోల వంక సీరియ‌స్‌గా చూస్తుండ‌టం ఉత్కంఠ‌ రేకెత్తిస్తోంది. త్వ‌ర‌లో టీజ‌ర్‌ను రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. యుగ్ రామ్, శశిత కోన‌, నీలిమ పెత‌కంశెట్టి, సౌమ్య శెట్టి, 'కేరాఫ్ కంచ‌ర‌పాలెం' ఫేమ్ రాజు, ఉమామ‌హేశ్వ‌ర రావు, కిశోర్‌, శ్యామ్‌, మ‌ధు కీల‌క పాత్ర‌ధారులైన ఈ చిత్రాన్ని ఎస్‌.ఎస్‌. ఫిలిమ్స్‌, శ్రీ‌పాద క్రియేష‌న్స్‌, షేడ్ స్టూడియోస్ క‌లిసి నిర్మిస్తున్నారు.

స‌ర‌యు త‌ల‌శిల సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమా మ‌ధు పొన్నాస్ మ్యూజిక్ స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి సందీప్ బ‌ద్దుల సినిమాటోగ్రాఫ‌ర్‌గా, ర‌వితేజ కుర్మాన ఎడిట‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా కేరాఫ్ కంచరపాలెం తరహాలోనే అందరి దృష్టినీ ఆకర్షిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్‌.

click me!