అప్పుడు భార్యాభర్తలు.. ఇప్పుడు డబ్బులు.. `ఎఫ్‌3` కథ ఇదేనా?

Published : Dec 13, 2020, 03:37 PM IST
అప్పుడు భార్యాభర్తలు.. ఇప్పుడు డబ్బులు.. `ఎఫ్‌3` కథ ఇదేనా?

సారాంశం

`f2` సీక్వెల్‌ని రూపొందిస్తున్నట్టు గతంలో వార్తలు వినిపించాయి. `ఎఫ్‌3` పేరుతో ఈ సినిమాని తెరకెక్కించనున్నట్టు, మరింత ఫన్‌తో సినిమాని రూపొందించబోతున్నట్టు వార్తలు వినిపించాయి. తాజాగా ఈ విషయాన్ని హీరో వెంకటేష్‌, చిత్ర నిర్మాత దిల్‌రాజు అధికారికంగా ప్రకటించారు.

విక్టరీ వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా నటించిన `ఎఫ్‌2`(ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌) చిత్రం భారీ విజయాన్ని సాధించింది. గతేడాది సంక్రాంతికి విడుదలై వందకోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టి అందరిని షాక్‌కి గురి చేసింది. అనిల్‌ రావిపూడి మ్యాజిక్‌కి, సంక్రాంతి సీజన్‌ కలిసి రావడంతో సినిమా బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. 

దీనికి సీక్వెల్‌ని రూపొందిస్తున్నట్టు గతంలో వార్తలు వినిపించాయి. `ఎఫ్‌3` పేరుతో ఈ సినిమాని తెరకెక్కించనున్నట్టు, మరింత ఫన్‌తో సినిమాని రూపొందించబోతున్నట్టు వార్తలు వినిపించాయి. తాజాగా ఈ విషయాన్ని హీరో వెంకటేష్‌, చిత్ర నిర్మాత దిల్‌రాజు అధికారికంగా ప్రకటించారు. నేడు(ఆదివారం) వెంకటేష్‌ పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ విషయాన్ని వెల్లడించారు. 

`ఎఫ్‌2`ని భార్యా భర్తల మధ్య మనస్పార్థాలు, అర్థం చేసుకునే విషయంలో వచ్చే తేడాలు, పెళ్ళికి ముందున్న ఆలోచనలు, పెళ్లి తర్వాత వచ్చే ఇబ్బందులు, ఈ సందర్భంగా పుట్టే ఫన్‌ ప్రధానంగా రూపొందించారు. తాజాగా `ఎఫ్‌3`ని డబ్బుల వల్ల వచ్చే సమస్యలు, దీని వల్ల పుట్టే ఫన్‌ ప్రధానంగా తెరకెక్కించనున్నట్టు దర్శకుడు అనిల్‌ రావిపూడి తెలిపారు. ఇందులో కూడా వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌, తమన్నా, మెహరీన్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నట్టు తెలిపారు. మరి మరో హీరో ఎవరు అన్నది సస్పెన్స్ నెలకొంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు
BMW Teaser: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ రివ్యూ.. వరుస డిజాస్టర్లతో రూటు మార్చిన రవితేజ, రొమాన్స్ షురూ