మోడీ బాటలో పెద్దోడు.. చిన్నోడు.. ఏం చేశారంటే?

By Aithagoni RajuFirst Published Oct 8, 2020, 5:55 PM IST
Highlights

 కరోనాని సమిష్టిగా ఎదుర్కొనే ఉద్యమానికి పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. `యునైట్‌2ఫైట్‌కరోనా` అనే నినాదాన్ని తీసుకొచ్చారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌ ద్వారా ఓ పోస్ట్ ని ప్రజలతో పంచుకున్నారు. 

కరోనా మహమ్మారి ఇంకా తగ్గడం లేదు సరికదా మరింతగా విజృంభిస్తోంది. దాని దెబ్బకి ప్రపంచం ఇంకా అతలాకుతలమవుతోంది. అయితే రికవరీ రేటు పెరగడం కాస్త ఉపశమనం కలిగించే అంశం. దీంతో క్రమంగా ప్రపంచం కరోనా లాక్‌డౌన్‌ నుంచి బయటపడుతుంది. 

ఇండియాలో దాదాపు అన్ని సడలింపులు ఇచ్చేశారు. అన్ని రకాలు సంస్థలు ఓపెన్‌ అవుతున్నాయి. ఈ నెల 15 నుంచి స్కూల్స్, థియేటర్లు ఓపెన్‌కి కేంద్రం అనుమతి ఇచ్చింది. అలాగే నవంబర్‌ 1 నుంచి కాలేజ్‌లు కూడా ఓపెన్‌ చేసేందుకు అనుమతులు వచ్చేశాయి. 

సడలింపు వచ్చినా ఇండియాలో కరోనా ఉదృతి ఆగడం లేదు. రోజుకి ఇండియాలో సుమారు లక్ష వరకు కేసులు నమోదు అవుతున్నాయి. కరోనాని లైట్‌ తీసుకోవడానికి లేదు. ఈ నేపథ్యంలో దేశ ప్రధాని మోడీ కొత్త రకమైన మూవ్‌మెంట్‌కి పిలుపునిచ్చారు. మొదట చప్పట్లు కొట్టాలన్నారు. తర్వాత కొవ్వొత్తులు వెలిగించాలన్నారు. అవేవి కరోనాని అంతం చేయలేకపోయాయి. కాకపోతే యూనిటీని తీసుకొచ్చాయి. 

తాజాగా కరోనాని సమిష్టిగా ఎదుర్కొనే ఉద్యమానికి పిలుపునిచ్చారు. `యునైట్‌2ఫైట్‌కరోనా` అనే నినాదాన్ని తీసుకొచ్చారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌ ద్వారా ఓ పోస్ట్ ని ప్రజలతో పంచుకున్నారు. ఎప్పటికీ గుర్తుంచుకోవాలని, `మాస్క్ కచ్చితంగా ధరించాలి అని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని అని, సోషల్‌ డిస్టెన్స్ ఫాలో కావాలని, కలిసికట్టుగా కరోనాని జయిందాం` అనే పేర్కొన్నారు. 

దీనికి విశేష స్పందన లభిస్తుంది. టాలీవుడ్‌ పెద్దోడు వెంకటేష్‌, చిన్నోడు మహేష్‌బాబు స్పందించారు. వెంకటేష్‌ ట్వీట్‌ చేస్తూ, ఈ  సమస్యని అంత తేలికగా తీసుకొవద్దని, కరోనాకి వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలని అభ్యర్థించారు. నేను ఎలాగైతే కరోనాకి వ్యతిరేకంగా పోరాడుతున్నానో, ప్రజలందరూ దాన్ని ఫాలో కావాల`ని తెలిపారు. 

Requesting everyone to continue the fight against corona just as I am! 🙏🏼

Let’s join our Hon’ble PM in his and

- Wear Mask 😷
- Wash Hands 🖐
- Maintain Social Distancing pic.twitter.com/uMHFhzxcoc

— Venkatesh Daggubati (@VenkyMama)

Cannot press on this issue enough!
Request everyone to continue to fight against corona 🙏🏼
Let’s https://t.co/P6nwFwhKTE

— Venkatesh Daggubati (@VenkyMama)

మహేష్‌ బాబు స్పందిస్తూ, ఈ మహమ్మారిని సమిష్టిగా పోరాటం చేయడం ఒక్కటే మార్గం. మరోసారి చెబుతున్నా,ప్రతి ఒక్కరు మాస్క్ ధరించండి, చేతులు తరచూ కొడుక్కోండి. దూరంగా ఉండండి` అని పేర్కొన్నారు. అన్నట్టు `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`లో వెంకీ, మహేష్‌ కలిసి నటించగా, ఇందులో వారిని పెద్దోడు, చిన్నోడు అని పిలవడం విశేషం.

With you on this one Ji! Fighting this pandemic collectively is the only way through. Once again, wear a mask, wash your hands frequently and remember to keep distance! 🙏 https://t.co/CKFfupdGSJ

— Mahesh Babu (@urstrulyMahesh)
click me!