ఆర్ఎక్స్100: బాలీవుడ్ రీమేక్ లో సీనియర్ హీరో తనయుడు!

Published : Sep 25, 2018, 02:22 PM IST
ఆర్ఎక్స్100: బాలీవుడ్ రీమేక్ లో సీనియర్ హీరో తనయుడు!

సారాంశం

2.5 కోట్లతో ఎలాంటి స్టార్ డమ్ లేని కార్తికేయను కథానాయకుడిగా సెట్ చేసుకొని దర్శకుడు అజయ్ భూపతి చేసిన ఆ ప్రయోగం మంచి లాభాలను అందించింది. దాదాపు 15 కోట్ల వరకు షేర్స్ అందించినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ లవ్ స్టోరీపై ఇతర ఇండస్ట్రీల కన్ను కూడా పడింది. 

ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న చిత్రం ఆర్ఎక్స్ 100. అసలు సినిమా రిలీజ్ అయ్యే వరకు  ఆ స్థాయిలో కలెక్షన్స్ సృష్టిస్తుందని ఎవరు ఊహించలేదు. 2.5 కోట్లతో ఎలాంటి స్టార్ డమ్ లేని కార్తికేయను కథానాయకుడిగా సెట్ చేసుకొని దర్శకుడు అజయ్ భూపతి చేసిన ఆ ప్రయోగం మంచి లాభాలను అందించింది. దాదాపు 15 కోట్ల వరకు షేర్స్ అందించినట్లు తెలుస్తోంది. 

ఇకపోతే ఈ లవ్ స్టోరీపై ఇతర ఇండస్ట్రీల కన్ను కూడా పడింది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత సాజిద్ నదియద్వాల నార్త్ సైడ్ హక్కులను దక్కించేసుకున్నాడు. కథ కోసం సాజిద్ 1.05 కోట్లు చెల్లించినట్లు సమాచారం. ఇకపోతే ఈ కథకు బాలీవుడ్ లో సరైన కథానాయకుడి కోసం గత కొంత కాలంగా సెర్చ్ చేస్తున్నారు. రీసెంట్ గా సీనియర్ నటుడు సునీల్ శెట్టి కుమారుడైన ఆహాన్ శెట్టి అయితే బెటర్ అని నిర్మాత ఆలోచించాడట. 

ప్రస్తుతం ఆహాన్ వయసు 22. తన కొడుకు  మంచి యాక్షన్ కథతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని  సునీల్ శెట్టి ప్లాన్ చేస్తున్నట్లు చాలా సార్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కానీ ఆర్ఎక్స్ 100 కథకి ఇలాంటి అప్ కమింగ్ హీరో అయితే బెటర్ అని సాజిద్ డిసైడ్ అయినట్లు సమాచారం. ఇక కథను బాలీవుడ్ నేటివిటీకి తగ్గట్టు మార్చి త్వరలోనే ప్రాజెక్టును స్టార్ట్ చేయాలనీ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. 

 

 

 

PREV
click me!

Recommended Stories

Samantha Pregnancy: సమంత తల్లి కాబోతోందా..ఆమెలో ఈ మార్పుకు కారణం అదేనా ?
Dhanush Mrunal Breakup: ఎప్పుడు ప్రేమించుకున్నారు..? అప్పుడే విడిపోయారా..?