Guppedantha Manasu: రిషికి అసలు నిజం చెప్పిన వసుధార.. కళ్ళు తిరిగి పడిపోయిన వసు?

Published : Feb 17, 2023, 07:13 AM IST
Guppedantha Manasu: రిషికి అసలు నిజం చెప్పిన వసుధార.. కళ్ళు తిరిగి పడిపోయిన వసు?

సారాంశం

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్  కొనసాగుతుంది. ఇక ఈరోజు ఫిబ్రవరి 17వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

ఈరోజు ఎపిసోడ్ లో వసుధార అమ్మవారి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాలు తలుచుకొని అమ్మ ఏంటమ్మా ఇది ఇదంతా విశేషాలు కోసమే కదా చేసింది తన అర్థం చేసుకోవడం లేదు నా బాధ ఎవరికి చెప్పుకోవాలి. ప్రతి చిన్న విషయంలో నన్ను అర్థం చేసుకునే రిషి సార్ ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నారు. నా సంతోషమైన దుఃఖమైనా నీతోనే కదా నేను పంచుకునేది అని బాధపడుతూ అక్కడే ఉన్న పసుపు, కుంకుమ తీసుకొని రిషిధార అని రాస్తుంది. అప్పుడు వసుధర  తన బాధను అమ్మవారికి చెప్పుకొంటూ బాధపడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి రిషి వస్తాడు.

అప్పుడుఇద్దరు ఒకరి వైపు ఒకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. తరువాత రిషి, వసు ఇద్దరు గట్టిగా హత్తుకొని సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు రిషి నాకు ఒక నిజం తెలుసుకోవడానికి నాకు ఇన్ని రోజులు సమయం పట్టింది. వసు నేను ఎన్ని రోజులు ఆగాలి. ఏం జరుగుతుంది వసుధార ఎందుకు ఇలా చేశావు అన్నంతో నీకోసమే సార్ అని అంటుంది. నాకోసమే అన్నప్పుడు నాకు చెప్పాలి కదా ఎందుకు నాకు చెప్పకుండా దాచావు అని అంటాడు. ఇన్ని రోజులు నా ఎమోషన్స్ తో ఆడుకున్నావు నాకు ఏమీ చెప్పడం లేదు అంటూ వసు చెప్పేది వినిపించుకోకుండా రిషి బాధపడుతూ మాట్లాడుతాడు.

అప్పుడు వసుధార నేను కావాలని చేయలేదు సార్ చేయాల్సి వచ్చింది అని జరిగింది మొత్తం వివరించడంతో రిషి షాక్ అవుతాడు. మన మధ్య దాపరికాలు ఉండవు అనుకున్నాను. నీ సైడ్ నుంచి నువ్వు కరెక్ట్ గానే చేసి నన్ను చేతగాని వాడివి చేశావు కాలేజీలో వసుధార పెళ్లి చేసుకుంది అని ప్రతి ఒక్కరు అన్నప్పుడల్లా రంపంతో నా గుండె కోసినట్టు అయింది అంటాడు రిషి. అయిన నీ చేతులతో నువ్వు తాళి కట్టుకోవడం ఏంటి వసుధారా అనగా నేనే వేసుకున్నాను కానీ ఇది మీరు వేసినట్టుగా భావించాను అంటుంది వసుధార.  అప్పుడు రిషి వసుధారని అర్థం చేసుకోకుండా వసుధార మీద అరుస్తూ నువ్వు నిర్ణయాలు తీసుకొని ఇలా చేస్తావా అని సీరియస్ అవుతాడు. నీ అంతటి నువ్వు చేసావు.

అందరి కళ్ళు నా వైపు అందరూ అన్న మాటలకు నేను నరకం అనుభవించాను అంటాడు. అప్పుడు వసు మెడలో తాళి చూపించి ఇది మీ చేతులతో మీరే ఇచ్చారు అనడంతో అప్పుడు రిషి ఆశ్చర్యపోతాడు. అప్పుడు రిషి నువ్వు చేసింది ముమ్మాటికి తప్పు తప్పే అని అంటాడు. అప్పుడు వసుధార కళ్ళు తిరిగి పడిపోవడంతో రిషి అక్కడి నుంచి తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత ధరణి లగ్నపత్రిక తీసుకొని వెళ్తుండగా ఏంటది అనడంతో తెలిసినవారు శుభలేఖ ఇచ్చారు అని అంటుంది. అప్పుడు దేవయాని జగతి మహేంద్ర వాళ్లు రావడం గమనించి  అంతా బాగుంటే ఈపాటికి రిషి పెళ్లికి శుభలేఖలు చేయించే వాళ్ళం కదా అనడంతో జగతి,మహేంద్ర అక్కడికి వెళ్లి దేవయానికి వెటకారంగా సమాధానాలు చెబుతూ ఉంటారు.

ఇప్పుడు జగతి ధరణి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. మరోవైపు రిషి కారులో వసుధారని పిలుచుకొని వెళ్తూ ఇంత పెద్ద నిజాన్ని నా దగ్గర  ఎలా దాచావు వసుధార అనుకుంటూ ఉంటాడు. తర్వాత రిషి ఒక సైడ్ కి కారు ఆపి ఏంటి వసుధార పడిపోయావు అనడంతో టెన్షన్ లో పడిపోయాను సార్ అని అంటుంది. అప్పుడు పర్లేదు సార్ అని అనడంతో అప్పుడు రిషి బయలుదేరాలి అని చూస్తుండగా వెక్కిళ్లు రావడంతో వసుధార వాటర్ బాటిల్ తీసుకొని వస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కారులో వెళ్తూ ఉంటారు.

PREV
click me!

Recommended Stories

మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ
Bigg Boss Top 5: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే.. ఒక్క లీక్‌తో లెక్కలన్నీ తారుమారు