సైరా సాంగ్స్ కింగ్.. సిరివెన్నెల!

Published : Jan 29, 2019, 04:01 PM IST
సైరా సాంగ్స్ కింగ్.. సిరివెన్నెల!

సారాంశం

  సైరా సినిమాతో రెడీ అవుతున్న మెగాస్టార్ కోసం అభిమానం లోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సినిమా రిలీజ్ అనంతరం ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో గాని మెగాస్టార్ ని ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి పాత్రలో కనుల నిండా వీలైనంత త్వరగా చూసుకోవాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు

సైరా సినిమాతో రెడీ అవుతున్న మెగాస్టార్ కోసం అభిమానం లోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సినిమా రిలీజ్ అనంతరం ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో గాని మెగాస్టార్ ని ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి పాత్రలో కనుల నిండా వీలైనంత త్వరగా చూసుకోవాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా పనులు చకచకా జరుగుతున్నాయి. 

ఇక సినిమాలో ఆరు పాటలు ఉండగా వాటికి సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని అందించనున్నారు. ఈ హిస్టారికల్ సినిమాకు లిరిసిస్ట్ గా సింగిల్ టైటిల్ కార్డు ను సిరివెన్నెల అందుకోనున్నారు. ఇటీవల ఆయనను పద్మశ్రీ వరించిన సంగతి తెలిసిందే. అందుకుగాను మెగాస్టార్ ప్రత్యేకంగా ఆయన్ను కలుసుకొని సత్కరించారు. 

అదే విధంగా సినిమాలో అన్ని పాటలను సిరివెన్నెల గారు రాయబోతున్నారని చెబుతూ.. గతంలో నా సినిమా రుద్ర వీణకు ఆయన వర్క్ చేసినప్పుడే జాతీయ అవార్డు రావాల్సింది. కానీ  ఒక్క ఓటుతో మిస్ అయ్యారు. ఇక ఇప్పుడు సైరా సినిమాకు ఖచ్చితంగా వస్తుందని మెగాస్టార్ నమ్మకాన్ని వ్యక్తం చేశారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సైరా సినిమాకు బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.   

PREV
click me!

Recommended Stories

Chiranjeevi: చిరంజీవితో నటించి స్టార్ హీరోలని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు.. ఒకరైతే అందరికీ బిగ్ సర్ప్రైజ్
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు లాఠీ ట్రీట్, బెంగళూరులో ఏం జరిగింది?