Ghani OTT: ఓటీటీలోకి 'గని'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే?!

Surya Prakash   | Asianet News
Published : Apr 10, 2022, 01:20 PM IST
Ghani OTT: ఓటీటీలోకి   'గని'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే?!

సారాంశం

'గద్దలకొండ గణేష్' తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నుండి వచ్చిన తాజా చిత్రం 'గని'. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా.. నవీన్ చంద్ర ఉపేంద్ర సునీల్ శెట్టి జగపతిబాబు ముఖ్య పాత్రలను పోషించారు.


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ గని ఆడియన్స్ ముందుకు మొన్న శుక్రావరం వచ్చింది. వరల్డ్ వైడ్ గా దాదాపు 750 వరకు థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకుంది.  అయితే  సినిమా అంచనాలను అందుకోలేక చతికిలపడింది.ఓవరాల్ గా స్టోరీ లైన్  వరకు బాగానే ఉన్నా కానీ డైరెక్టర్ ఫస్టాఫ్ కథ ను మలచిన విధానం చాలా నెమ్మదిగా, కంప్లీట్ గా ప్రిడిక్ట్ చేసే విధంగా ఉండటంతో ఏ దశలో కూడా సినిమా ఎక్సపెక్టేషన్స్ ని అందుకోలేక పోతుంది. కథలో ఉన్న ఎమోషన్స్ ఆడియన్స్ అస్సలు ఫీల్ అయ్యేలా కనెక్ట్ అయ్యేలా లేక పోవడం సినిమా కి బిగ్గెస్ట్ డ్రా బ్యాక్స్ గా మారింది. రివ్యూలు నెగిటివ్ గా రావటంతో మెగాభిమానులు సైతం సినిమాకు దూరంగా ఉండిపోయారు. వారంతా సినిమా ఓటిటి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు.

థియేటర్స్లో 'ఆర్ఆర్ఆర్' రన్ అవుతుండటం తో.. గని ఓపెనింగ్స్ కూడా అంతంత మాత్రం గానే వచ్చాయి. ఇకపోతే కరోనా వచ్చిన తర్వాత థియేటర్స్లో విడుదలైన చిత్రాలన్నీ నాలుగైదు వారాలలోపే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అందులోనూ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన చిత్రాలైతే రెండు వారాలకే ఓటీటీ బాట పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 'గని' సినిమా కూడా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అవుతోంది. అల్లు అరవింద్ సమర్పణలోనే గని నిర్మితమవడంతో.. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు 'ఆహా'కే సొంతం అయ్యాయి.  ఏప్రిల్ 8న విడుదలైన ఈ చిత్రం సరిగ్గా మూడు వారాల తర్వాత అంటే ఏప్రిల్ 29 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై త్వరలోనే ఆహా టీమ్ అధికారిక ప్రకటన సైతం ఇవ్వనుందని టాక్.

'గద్దలకొండ గణేష్' తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నుండి వచ్చిన తాజా చిత్రం 'గని'. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా.. నవీన్ చంద్ర ఉపేంద్ర సునీల్ శెట్టి జగపతిబాబు ముఖ్య పాత్రలను పోషించారు. బడా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిల్మ్స్ అల్లు బాబీ కంపెనీ బ్యానర్ల పై సిద్ధు ముద్ద అల్లు బాబీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందించాడు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ
Bigg Boss Top 5: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే.. ఒక్క లీక్‌తో లెక్కలన్నీ తారుమారు