బజ్ లేదు ,క్రేజ్ లేదు, అంత రేటుకు ఎలా అమ్మారయ్యా?

 ఈ సినిమాతో వరుణ్ తేజ్ బాలీవుడ్ కి హీరోగా ఆరంగేట్రం చేస్తుండగా మానసి చిల్లర్ తెలుగు వెండితెరకి కథానాయికగా పరిచయం అవుతుంది. 

Varun Tej Operation valentine non theatrical rights sold for a record price jsp


మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్(Varun Tej)సినిమాలు ఏమీ భాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కావటం లేదు. తొలి ప్రేమ తర్వాత చెప్పుకోదగ్గ హిట్ ఆయన ఖాతాలో పడలేదు. అయినా తన ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ  డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ను ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ప్రయోగాలు చేయడంలో ఈ మెగా హీరో ఎప్పుడు ముందుంటారని ఆయనతో పనిచేసినవారు చెప్తూంటారు.  వరస పెట్టి ఎఫ్3, గని, గాండీవధారి అర్జున చిత్రాలు నిరాశ పరచడంతో ప్రస్తుతం ‘ఆపరేషన్ వాలెంటైన్’పై భారీ అశలు పెట్టుకున్నాడు. యాడ్ ఫిల్మ్ మేకర్ శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా వరుణ్ తేజ్ నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం నాన్ థియేటర్ బిజినెస్ గురించిన వార్త ఒకటి బయిటకు వచ్చి అందరికీ షాక్ ఇచ్చింది.

 బాలీవుడ్ మీడియా నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రానికి నాన్ థియెట్రికల్ డీల్ భారీగా జరిగింది. 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీకి నాన్ థియేట్రికల్ రైట్స్ కి గాను రూ.50 కోట్లకు పైగా డీల్ సెట్ అయినట్లు చెప్తున్నారు. ఇందులోనే ఓటీటీ, శాటిలైట్ తో పాటు ఆడియో రైట్స్ కూడా ఉన్నాయని  సమాచారం. అయితే ఈ న్యూస్ పీఆర్ నుంచి బయిటకు స్ప్రెడ్ చేసి బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసారా ...నిజంగానే 50 కోట్లకు అమ్మారా అనేది తెలియాల్సి ఉంది. నిజమైతే మాత్రం  ప్రస్తుతం వరుణ్ తేజ్ ఉన్న పరిస్థితిలో ఈ డీల్ చాలా పెద్దదనే చెప్పాలి. బ్యాక్ టు బ్యాక్ రెండు డిజాస్టర్స్ తర్వాత కూడా ఇలాంటి భారీ డీల్ కుదిరింది అంటే మామూలు విషయం కాదు.

Latest Videos

 ఈ చిత్రంలో ఈ మూవీలో IAF ఆఫీసర్ గా వరుణ్ కనిపిస్తోన్నట్లు తెలుస్తోంది.   వరుణ్ సరసన హీరోయిన్‌గా మానుషి చిల్లర్ నటించింది. ఆమె రాడార్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది.   ఎయిర్ ఫోర్స్ లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని తెరకెక్కుతుందని ప్రకటించారు. వరుణ్ తేజ్ 13వ సినిమాగా వస్తోన్న ఈ మూవీకి కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్(Shakti Pratap Sing)  డైరెక్ట్ చేస్తున్నట్లు తెలిపారు.  ఈ మూవీ 2023 డిసెంబర్ 8న తెలుగు,హిందీ భాషల్లో రిలీజ్ కాబోతుంది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్( Sony Pictures International Productions ), రినైసన్స్ పిక్చర్స్(Renaissance Pictures) సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.    
 

vuukle one pixel image
click me!