హీరోయిన్‌ మూడో పెళ్లి: నటికి ఘాటు రిప్లై ఇచ్చిన వనిత

Published : Jun 30, 2020, 04:50 PM IST
హీరోయిన్‌ మూడో పెళ్లి: నటికి ఘాటు రిప్లై ఇచ్చిన వనిత

సారాంశం

నటి, వ్యాఖ్యత  లక్ష్మీ రామకృష్ణన్‌ ట్విటర్‌లో విమర్శలు చేసింది. `ఇప్పుడే ఈ వార్త చూశాను. ఇప్పటికే వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రైన వ్యక్తిని, మొదటి భార్యకు విడాకులు ఇవ్వని వ్యక్తిని ఎలా వివాహం చేసుకున్నారు. బాగా చదువుకున్న, సెలబ్రిటీ అయిన వారు  ఇలాంటి పెద్ద తప్పు ఎలా చేశారు` అంటూ వనితా పెళ్లిపై కామెంట్‌ చేసింది లక్ష్మీ.

హీరోయిన్‌ వనిత విజయ్‌ కుమార్‌ మూడో పెళ్లిపై వివాదం చెలరేగుతోంది. ఎదిగిన కూతుళ్లు ఉండగా మూడో పెళ్లి చేసుకోవటం పిల్లల ముందే భర్తకు లిప్‌ లాక్‌ చేయటం లాంటి వాటిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో వనితను పెళ్లాడిన పీటర్‌ పాల్‌ మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. పీటర్ మొదటి భార్య ఎలిజిబెత్‌ స్వయంగా విమర్శలు చేయటంతో విమర్శలు తీవ్ర స్థాయిలో వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో నటి, వ్యాఖ్యత  లక్ష్మీ రామకృష్ణన్‌ ట్విటర్‌లో విమర్శలు చేసింది. `ఇప్పుడే ఈ వార్త చూశాను. ఇప్పటికే వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రైన వ్యక్తిని, మొదటి భార్యకు విడాకులు ఇవ్వని వ్యక్తిని ఎలా వివాహం చేసుకున్నారు. బాగా చదువుకున్న, సెలబ్రిటీ అయిన వారు  ఇలాంటి పెద్ద తప్పు ఎలా చేశారు. అయినా పెళ్లి జరిగిపోయే వరకు పీటర్ మొదటి భార్య ఎందుకు ఆగారు? ముందే ఎందుకు ఆపలేదు` లక్ష్మీ సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నించింది.

అయితే ఈ వ్యాఖ్యలపై వనిత కూడా ఘాటుగా స్పందించింది. `ఇద్దరు మనుషులు ఎందుకు విడిపోతారో, ఎందుకు విడాకులు తీసుకుంటారో నీకు తెలుసా? మా వ్యక్తిగత విషయాల్లో నీకు ఎలాంటి సంబంధమూ లేదు. నీ పని నువ్వు చూసుకో` అంటూ రిప్లై ఇచ్చింది వనిత. నెటిజెన్లు కూడా వనిత తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?