వంశీ పైడిపల్లి నెక్ట్స్ మెగా హీరోతోనే కానీ రామ్ చరణ్ కాదు

Published : Jun 01, 2019, 12:37 PM IST
వంశీ పైడిపల్లి నెక్ట్స్ మెగా హీరోతోనే కానీ రామ్ చరణ్ కాదు

సారాంశం

మహర్షి చిత్రంతో రీజనబుల్ హిట్ కొట్టారు దర్శకుడు వంశీ పైడిపల్లి. 

మహర్షి చిత్రంతో రీజనబుల్ హిట్ కొట్టారు దర్శకుడు వంశీ పైడిపల్లి. ఈ చిత్రం ప్రమోషన్ లో ఇన్నాళ్లూ గడిపిన ఆయన కొద్దిగా రెస్ట్ తీసుకుని తన తదుపరి ప్రాజెక్టులోకి ప్రయాణం పెట్టుకోబోతునట్లు సమాచారం. ఈ సారి కూడా ఆయన దిల్ రాజు నిర్మాతగానే సినిమా చేయనున్నారు. ఈ విషయాన్ని ఆల్రెడీ ప్రకటించారు కూడా. 

ఈ నేపధ్యంలో వంశీ పైడిపల్లి ఏ హీరోతో చేయబోతున్నాడనే విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే మెగా క్యాంప్ హీరోతో ఈ సినిమా ఉండబోతోందని ఖరారు అయ్యింది. అయితే ఆ హీరో ఎవరనేది సస్పెన్స్ గా మారింది. చాలా మంది మళ్లీ రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నాడంటున్నారు. అయితే అది నిజం కాదని తెలుస్తోంది.

ఫిల్మ్ సర్కిల్స్ నుంచి  అందుతున్న సమాచారం ప్రకారం  వంశీ పైడిపల్లి తన తదుపరి చిత్రాన్ని అల్లు అర్జున్ తో చేయబోతున్నారట. ఈ మేరకు దిల్ రాజు , బన్ని తో ఆల్రెడీ మాట్లాడారట. అల్లు అర్జున్ సైతం వంశీ చేయటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. త్వరోలనే స్టోరీ లైన్ చెప్పి బన్ని డేట్స్ లాక్ చేసి మిగతా పనుల్లో పడతారని సమాచారం. ఈ సారి ఎంటర్టైన్మెంట్ తో కూడిన సబ్జెక్ట్ అని తెలస్తోంది.

PREV
click me!

Recommended Stories

Chiranjeevi, Mahesh Babu సినిమాలతో పోటీ పడి టాప్ 5లో నిలిచిన హీరో, టాలీవుడ్ రాజకీయాలపై ఓపెన్ కామెంట్స్
Thalapathy Vijay సినిమా స్టోరీ లీక్, జన నాయగన్ కథ ఇదేనా? షాక్ లో మూవీ టీమ్