కళ్యాణ్ రామ్ మూవీ వాయిదా మెగా హీరోకి కలిసి వచ్చిందిగా..ఆదికేశవపై వరల్డ్ కప్ ఎఫెక్ట్, కొత్త రిలీజ్ డేట్ ఇదే

Published : Nov 01, 2023, 01:14 PM IST
కళ్యాణ్ రామ్ మూవీ వాయిదా మెగా హీరోకి కలిసి వచ్చిందిగా..ఆదికేశవపై వరల్డ్ కప్ ఎఫెక్ట్, కొత్త రిలీజ్ డేట్ ఇదే

సారాంశం

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య కలసి నిర్మిస్తున్న చిత్రం ఆది కేశవ. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటిస్తున్నారు.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య కలసి నిర్మిస్తున్న చిత్రం ఆది కేశవ. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటిస్తున్నారు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. 

ఉప్పెన తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం వైష్ణవ్ తేజ్ కష్టపడుతున్నాడు. చివరగా వైష్ణవ్ నుంచి వచ్చిన రంగ రంగ వైభవంగా మూవీ తీవ్రంగా నిరాశపరిచింది. దీనితో వైష్ణవ్ తేజ్ ఆదికేశవ చిత్రంపై ఆశలు పెట్టుకున్నాడు. టాలీవుడ్ ని దున్నేస్తున్న శ్రీలీల ఎలాగూ ఉంది కాబట్టి మంచి బజ్ వస్తుంది. అయితే ఈ చిత్రాన్ని ముందుగా నవంబర్ 10న రిలీజ్ చేయాలనుకున్నారు. 

కానీ తాజాగా ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు. కొత్త రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ఆదికేశవ చిత్రాన్ని నవంబర్ 24న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసారు. ప్రస్తుతం వరల్డ్ కప్ ఫీవర్ మామూలుగా లేదు. టీమిండియా మ్యాచ్ ఆడుతున్నప్పుడు అన్ని చిత్రాల కలెక్షన్స్ పడిపోతున్నాయి. అందుకే ఈ సమయంలో రిస్క్ ఎందుకని పోస్ట్ పోన్ చేసినట్లు నాగవంశీ అన్నారు. 

టీమిండియా సెమీఫైనల్ కి వెళ్లడం లాంఛనమే. ఫైనల్ కి వెళుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. నవంబర్ 15 నుంచి సెమీఫైనల్స్ ప్రారంభం అవుతాయి. నవంబర్ 19న ఫైనల్ ఉంటుంది. కాబట్టి సేఫ్ గా నవంబర్ 24న ఆదికేశవ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు నాగవంశీ అన్నారు. డిస్ట్రిబ్యూటర్స్ అందరితో చర్చించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 

ఇక్కడ మరో అంశం కూడా ఆదికేశవ చిత్రానికి కలసి వచ్చింది. నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న పీరియాడిక్ డ్రామా డెవిల్ చిత్రం నవంబర్ 24న రిలీజ్ కావలసింది. కానీ ఆ చిత్రం నిరవధికంగా వాయిదా పడింది. విఎఫెక్స్ లాంటి కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో డెవిల్ చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకుంది. సో అదే రోజున మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఆదికేశవగా దిగిపోతున్నాడు. 

PREV
click me!

Recommended Stories

బాలయ్యతో చేసిన ఆ సినిమా నా కెరీర్‌లో బిగ్గెస్ట్ మిస్టేక్.. ఓపెన్‌గా చెప్పేసిన స్టార్ హీరోయిన్
విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్