చేతికి కట్టుతో ఎన్టీఆర్ ఫొటో.. పెళ్లిరోజు కానుక

By Prashanth MFirst Published May 5, 2019, 5:10 PM IST
Highlights

ఈ రోజు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, ప్రణతి దంపతుల పెళ్లిరోజు. వీరి వివాహం జరిగి నేటికి ఎనిమిది సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఎన్టీఆర్ తన భార్యతో  కలిసి రీసెంట్ గా దిగిన  ఫొటోను ఫేస్ బుక్ ద్వారా షేర్ చేసారు. 

ఈ రోజు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, ప్రణతి దంపతుల పెళ్లిరోజు. వీరి వివాహం జరిగి నేటికి ఎనిమిది సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఎన్టీఆర్ తన భార్యతో  కలిసి రీసెంట్ గా దిగిన  ఫొటోను ఫేస్ బుక్ ద్వారా షేర్ చేసారు. 

‘ఎనిమిదేళ్లు.. మున్ముందు మరెన్నో సంవత్సరాల కోసం ఎదురుచూస్తున్నాం’ అని పేర్కొన్నారు.  ఈ ఫొటోలో ఎన్టీఆర్ చేతికి దెబ్బ తగిలింది అన్న విషయం తెలియచేస్తూ చేతికి కట్టు కట్టి ఉంది.  ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమా చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 

షూటింగ్  సమయంలో ఎన్టీఆర్‌ కుడి చేతికి గాయమైంది. దాంతో కొద్దిరోజుల పాటు షూటింగ్ ను నిలిపివేశారు. మరోపక్క చరణ్‌కు కూడా కాలికి గాయమైంది. ఇద్దరూ కోలుకున్నాక సినిమా షూటింగ్ ను కొనసాగిస్తారు. 2020 జులై 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  

ఇక ఈ ఫొటో చూసిన అభిమానులు..ఎలా ఉంది మీ చేతికి, గాయం నయమైననట్లేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొంత మంది  నుంచి తారక్‌ దంపతులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 2011 మే5న తారక్‌, ప్రణతిల వివాహం ఘనంగా జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. అభయ్‌ రామ్‌, భార్గవ్‌ రామ్‌. 

click me!