వెంకీ కూతురు పెళ్లి.. ఉపాసన కామెంట్!

Published : Mar 24, 2019, 12:38 PM IST
వెంకీ కూతురు పెళ్లి.. ఉపాసన కామెంట్!

సారాంశం

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత వివాహం ఆదివారం జైపూర్ లో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యుల సమక్షలో ఆశ్రిత తన ప్రేమించిన వినాయక్ ని పెళ్ళాడింది. 

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత వివాహం ఆదివారం జైపూర్ లో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యుల లో ఆశ్రిత తన ప్రేమించిన వినాయక్ ని పెళ్ళాడింది. ఈ పెళ్లి వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు. 

అయితే ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలను రామ్ చరణ్ భార్య ఉపాసన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. 'వెంకీ అంకుల్, నీరు ఆంటీ.. ఆశ్రిత, వినాయక్ కి అభినందనలు. మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. రానా దగ్గుబాటి, మిస్టర్ సి జైపూర్ లో ఇద్దరూ సూపర్ డేజావూ' అంటూ ఫోటోలను పోస్ట్ చేసింది.

హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడే వినాయక్ రెడ్డి. కొంతకాలం పాటు వినాయక్, ఆశ్రితలు ప్రేమించుకున్నారు. వారి ప్రేమను అంగీకరించిన పెద్దలు పెళ్లి వేడుక జరిపించారు. దగ్గుబాటి ఫ్యామిలీ సినీ ప్రముఖుల కోసంత్వరలోనే హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. 

PREV
click me!

Recommended Stories

Agadha: డర్టీ హరి తర్వాత అందుకే గ్యాప్, అగధ బాక్సాఫీస్ హిట్ గ్యారెంటీ.. హీరో శ్రవణ్ కామెంట్స్
Toxic: టాక్సిక్ ట్రైలర్ రివ్యూ.. వామ్మో ఇలా ఉందేంటి, యష్ మ్యాడ్నెస్ పీక్స్ అంతే.. పిల్లలు అస్సలు చూడకూడదు