బంపర్‌ ఆఫర్‌.. ఇండియన్‌ ఐడల్‌ హోస్ట్ గా `బిగ్‌బాస్‌` ఫేమ్‌ శ్రీరామచంద్ర

Published : Dec 27, 2021, 06:01 AM IST
బంపర్‌ ఆఫర్‌.. ఇండియన్‌ ఐడల్‌ హోస్ట్ గా `బిగ్‌బాస్‌` ఫేమ్‌ శ్రీరామచంద్ర

సారాంశం

బిగ్‌బాస్‌ 5 ఫేమ్‌ శ్రీరామచంద్ర ఇండియన్‌ ఐడల్‌ విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఆయన ఇప్పుడు హోస్ట్ గా అలరించబోతున్నారు. ఇండియన్‌ ఐడల్‌ షోకి హోస్ట్ గా చేయబోతుండటం విశేషం. 

ఇటీవల పూర్తయిన `బిగ్‌బాస్‌ 5` షో మూడో స్థానంలో నిలిచి అనేక మంది జనం ఆదరణ పొందారు శ్రీరామచంద్ర. సెటిల్డ్ గేమ్‌లతో మిస్టర్‌ పర్ఫెక్ట్ అనిపించుకున్నారు. అందరి హృదయాలను గెలుచుకున్నారు. అంతేకాదు అద్బుతమైన పాటలతో ఇతర హౌజ్‌మేట్స్ తోపాటు ఆడియెన్స్ ని అలరించారు. సోషల్‌ మీడియాలో శ్రీరామచంద్రకి విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. ఆయన నిత్యం ట్రెండింగ్‌లో నిలిచారు. అంతేకాదు గ్రాండ్‌ ఫినాలే రోజు చాలా మంది ఇంతర కంటెస్టెంట్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా శ్రీరామచంద్ర టైటిల్‌ విన్నర్‌ అవుతారని భావించారు. తమ అభిప్రాయం వెల్లడించారు. 

కానీ మొదట్నుంచి అనుకుంటున్నట్టుగానే వీజీ సన్నీ బిగ్‌బాస్‌ 5 విన్నర్‌గా నిలిచారు. రన్నరప్‌గా షణ్ముఖ్‌ నిలిచారు. మూడో స్థానానికే శ్రీరామచంద్ర నిలిచారు. అయితే తాను టైటిల్‌ గెలుస్తాననే నమ్మకంతో నాగచైతన్య ఇచ్చిన 20లక్షల ఆఫర్‌ని కూడా వదులుకున్నారు శ్రీరామచంద్ర. కానీ ఆడియెన్స్ హృదయాలను గెలుచుకున్నారు. ఇదిలా ఉంటే శ్రీరామచంద్రకి ఇప్పుడు ఓ బంపర్‌ ఆఫర్‌ తగిలింది. ఆయన ఓ షోకి హోస్ట్ గా చేసే అవకాశాన్ని అందుకున్నారు. 

శ్రీరామచంద 2013లో ఇండియన్‌ ఐడల్‌గా (హిందీ) గెలుపొందిన విషయం తెలిసిందే. ఆయన గాత్రానికి అనేక మంది సంగీత దర్శకులు, సింగర్స్‌ మంత్రముగ్ధులయ్యారు. తెలుగు ఇండియన్‌ ఐడల్‌ కార్యక్రమానికి శ్రీరామచంద్ర హోస్టింగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇండియన్‌ ఐడల్‌లో (హిందీ) సింగర్‌గా అలరించిన శ్రీరామచంద్రం హోస్ట్‌గా మారుతున్నారు. ఆయన ఏకంగా ఇండియన్‌ ఐడల్‌కే హోస్ట్ గా చేస్తుండటం విశేషం. ప్రముఖ తెలుగు ఓటీటీ 'ఆహా' త్వరలో 'తెలుగు ఇండియన్‌ ఐడల్' కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది. ఈ తెలుగు పాటల ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా శ్రీరామచంద్రను సెలెక్ట్‌ చేశారు నిర్వాహకులు. దీనికి సంబంధించిన విషయాన్ని ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం ఆడిషన్స్‌ జరుపుకుంటున్న తెలుగు 'తెలుగు ఇండియన్‌ ఐడల్‌' త్వరలోనే ప్రారంభం కానుంది. మరి సింగర్‌గా అలరించిన శ్రీరామచంద్ర.. హోస్ట్ ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌