బాబుతో బాలయ్య... అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రోమో వచ్చేస్తుంది!

Published : Oct 11, 2022, 01:42 PM ISTUpdated : Oct 11, 2022, 01:54 PM IST
బాబుతో బాలయ్య... అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రోమో వచ్చేస్తుంది!

సారాంశం

తెలుగు ప్రేక్షకుల క్రేజీ టాక్ షో అన్ స్టాపబుల్ సీజన్ 2 కి సర్వం సిద్ధమైంది. ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్స్ గా నారా చంద్రబాబు, లోకేష్ రావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి అంచనాలు పెరిగిపోయాయి.   

బాలకృష్ణ డెబ్యూ టాక్ షో అన్ స్టాపబుల్ ఊహకు మించిన సక్సెస్ అందుకుంది. ఇతర టాక్ షోలతో భిన్నంగా స్టార్స్ లైఫ్ లో ఉన్న వివాదాలు, పుకార్లు ప్రస్తావిస్తూ బాలయ్య అడిగే ప్రశ్నలు షోకి విపరీతమైన ఆదరణ తెచ్చిపెట్టాయి. వేదికలపై ఆగి ఆగి మాట్లాడే బాలయ్య హోస్ట్ అనగానే అందరూ పెదవి విరిచారు. ఆయనకు కోపం ఎక్కువ, లౌక్యంగా మాట్లాడగలడా అనే సందేహాలు వెలువరించారు.  కొందరైతే బాలయ్య సారథ్యంలో అన్ స్టాపబుల్ ప్లాప్ షో కావడం ఖాయం అన్నారు. 

అంచనాలు తారుమారు చేస్తూ అన్ స్టాపబుల్ షోని బ్లాక్ బస్టర్ సక్సెస్ చేశాడు బాలయ్య. తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో ప్రసారమైన ఈ షో నేషనల్ వైడ్ న్యూస్ అయ్యింది. భారీ వ్యూవర్షిప్ సాధించండి. సీజన్ 1 సక్సెస్ నేపథ్యంలో మరింత గ్రాండ్ గా సీజన్ 2 సిద్ధం చేశారు. ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్ గా బాలయ్య బావగారైన నారా చంద్రబాబు నాయుడు వస్తున్నారు. వీరితో అల్లుడు లోకేష్ సైతం జాయిన్ అవుతున్నారు. 

అక్టోబర్ 14న ఫస్ట్ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇక నేడు సాయంత్రం 5:30 నిమిషాలు ప్రోమో విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారిక పోస్టర్ విడుదల చేశారు. టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబుతో బాలయ్య ఎపిసోడ్ రాజకీయ అంశాలతో సాగే అవకాశం కలదు. ఇక ప్రోమోతో లాంచింగ్ ఎపిసోడ్ పై పూర్తి క్లారిటీ రానుంది. కాగా ఎన్టీఆర్ నుండి చంద్రబాబుకు అధికార మార్పిడి ఎపిసోడ్ చర్చిస్తారా లేదా అనేది ఆసక్తికరం. ఏది ఏమైనా బావ బాబును ఎలివేట్ చేసేలా బాలయ్య ప్రశ్నలు ఉంటాయనేది నిజం.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?
Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్