రష్మిక మందన్నా ఫేక్‌ వీడియోపై కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ స్ట్రాంగ్‌ రియాక్షన్‌..

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా.. ఫేస్‌తో ఉన్న ఒక డీప్‌ ఫేక్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. దీనిపై కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఘాటుగా స్పందించారు.

union minister rajeev chandrasekhar strongly reacted on rashmika mandanna deep fake video arj

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా ఇప్పుడు హాట్‌ టాపిక్ అవుతుంది. ఆమె ఫేస్‌తో ఉన్న ఓ ఫేక్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. చూసిన వారంత రష్మిక ఇలా ఉందేంటి? ఇలా మారిపోయిందేంటి? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వేరే అమ్మాయి బాడీకి రష్మిక ఫేస్‌ని యాడ్‌ చేసి(ఏఐ ద్వారా) ఈ వీడియో క్లిప్‌ని సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు కొందరు దుండగులు. ఇందులో అమ్మాయి పొట్టిబట్టల్లో కాస్త అసభ్యకరంగా ఉంది. 

అయితే రష్మిక ఫేస్‌ని యాడ్‌ చేసి (డీప్‌ ఫేక్‌) వైరల్‌ చేయడంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. పెద్ద స్టార్స్ సైతం దీనిపై స్పందిస్తూ మండిపడుతున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ కూడా స్పందించి, బలంగా కేసు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని, దుండగులను వదలకూడదని ఆయన సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. తాజాగా కేంద్ర ఐటీశాఖ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ స్పందించారు. 

Latest Videos

ఆయన ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇలాంటి తప్పుడు కంటెంట్‌ పోస్ట్ చేస్తే సదరు ప్లాట్‌ ఫామ్‌ 36గంటల్లో ఆ కంటెంట్‌ని తొలగించాల్సి ఉంటుందన్నారు. అలా జరగకపోతే బాధితులు ఆ సోషల్‌ మీడియాపై కోర్ట్ ని ఆశ్రయించవచ్చు అని చెప్పారు. ప్రధాని మోడీ ప్రభుత్వం ఇలాంటి డిజిటల్‌ కి సంబంధించిన భద్రతకి, నమ్మకాన్నికి నిర్ధారించడానికి కట్టుపడి ఉందన్నారు. 

PM ji's Govt is committed to ensuring Safety and Trust of all DigitalNagriks using Internet

Under the IT rules notified in April, 2023 - it is a legal obligation for platforms to

➡️ensure no misinformation is posted by any user AND

➡️ensure that when reported by… https://t.co/IlLlKEOjtd

— Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI)

2023ఏప్రిల్‌ ఐటీ నిబంధనల ప్రకారం ఇలాంటి ప్లాట్‌ఫారమ్‌లకు ఇది చట్టపరమైన బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఏదైనా వినియోగదారు, ప్రభుత్వం నివేదించనప్పుడు తప్పుడు సమాచారం 36గంటల్లో తొలగించాలని, అలా చేయని ఎడల ఆ ప్లాట్‌ఫారమ్‌లపై రూల్‌ 7, ఐపీసీ సెక్షన్ల కింద కోర్టుని ఆశ్రయించవచ్చు అన్నారు. ఇలాంటి డీప్‌ ఫేక్‌ కంటెంట్‌ చాలా ప్రమాదకరమైనదని, దానిపై సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఎక్స్ ద్వారా పోస్ట్ చేశారు.

దీనిపై రష్మిక మందన్నా కూడా స్పందించింది. తన బాధని, ఆవేదనని వ్యక్తం చేసింది. తాను ఇది చూసి షాక్‌ అయ్యానని, ఇది చాలా మంది సమస్య అని, టెక్నాలజీని మిస్‌ యూజ్‌ చేస్తున్నారనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఈ విషయంలో తనకు సపోర్ట్ గా నిలిచిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, అందరికి ధన్యవాదాలు. ఇదిలా నిజంగా ఎలా చేశారనేది ఆశ్చర్యంగా ఉంది. నమ్మలేకపోతున్నా అంటూ తన బాధని వెల్లడించింది రష్మిక. ప్రస్తుతం ఆమె `యానిమల్‌` , `పుష్ప2` చిత్రాల్లో నటిస్తుంది. `యానిమల్‌` డిసెంబర్‌ 1న విడుదల కాబోతుంది.
 

vuukle one pixel image
click me!