అంకుల్ డాన్స్ మూమెంట్స్ తో అదరగొట్టేశాడు (వీడియో)

First Published Jun 1, 2018, 10:37 AM IST
Highlights

అంకుల్ డాన్స్ మూమెంట్స్ తో అదరగొట్టేశాడు

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో అంకుల్‌ డాన్స్‌ వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. 40 ఏళ్లు పైబడిన ఓ వ్యక్తి ఏదో వేడుకలో స్టేజీపై వేసిన స్టెప్పులకు ఇప్పుడు అంతా ముగ్ధులైపోతున్నారు. జితేంద్ర, శతృఘ్నసిన్హా, గోవిందా కాంబోలో వచ్చిన ఖుద్‌గర్జ్‌(1987) చిత్రంలోని ‘ఆప్‌ కే ఆ జానే సే...’  పాటకు ఆ వ్యక్తి డాన్స్‌ చేశాడు. అచ్చం గోవిందాను ఇమిటేట్‌ చేస్తూ అతను చేసిన డాన్సింగ్‌ మూమెంట్స్‌ వావ్‌ అనిపించేలా ఉన్నాయి. పక్కన ఉన్న ఆంటీ మాత్రం పాపం ఆయన్ని అలా చూస్తూ ఉండిపోయింది. మ్యాజిక్‌ స్టెప్పులకు పేరున్న గోవిందనే తలదన్నెలా స్టెప్పులేశారంటూ ఆ అంకుల్‌పై అంతా ప్రశంసలు గుప్పిస్తున్నారు. సెలబ్రిటీల దగ్గరి నుంచి సామాన్యుల దాకా దాదాపు ప్రతీ ఒక్కరూ ఈ వీడియోను సర్క్యూలేట్‌ చేస్తున్నారు. అఫ్‌ కోర్స్‌ గత రెండు రోజులుగా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌.. ఇలా ఏ ఫోన్‌లలో ఎక్కడ చూసినా ఈ అంకుల్‌ సందడే.                    

                    "

click me!