KGF2: 19 ఏళ్ల కుర్రాడు అంత పెద్ద పని చేశాడా.. కేజిఎఫ్ 2 ఎడిటర్ గురించి నమ్మలేని నిజాలు.. 

Published : Apr 15, 2022, 05:16 PM IST
KGF2: 19 ఏళ్ల కుర్రాడు అంత పెద్ద పని చేశాడా.. కేజిఎఫ్ 2 ఎడిటర్ గురించి నమ్మలేని నిజాలు.. 

సారాంశం

కన్నడ స్టార్ హీరో యష్ ని పాన్ ఇండియా స్టార్ గా మార్చిన చిత్రం కేజిఎఫ్. ఈ చిత్రంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. మొదటి భాగం వసూళ్ల పరంగా రికార్డులు క్రియేట్ చేసింది.

కన్నడ స్టార్ హీరో యష్ ని పాన్ ఇండియా స్టార్ గా మార్చిన చిత్రం కేజిఎఫ్. ఈ చిత్రంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. మొదటి భాగం వసూళ్ల పరంగా రికార్డులు క్రియేట్ చేసింది. దీనితో రెండవ భాగంపై కనీవినీ ఎరుగని అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకు తగ్గట్లుగానే కేజిఎఫ్ 2 కూడా రికార్డులు తిరగరాస్తోంది. 

హిందీలో ఈ చిత్రం తొలి రోజు ఆల్ టైం టాప్ గ్రాసర్ గా నిలిచింది. చాలా ఏరియాల్లో కెజిఎఫ్ 2 చిత్రం బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ రికార్డులకు ఎసరు పెట్టబోతోంది అని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంతటి భారీ పాన్ ఇండియా చిత్రంలో ఒక కుర్రాడు అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాడు. 

కేజిఎఫ్ 2 లాంటి భారీ పాన్ ఇండియా చిత్రానికి ఎవరో స్టార్ ఎడిటర్ పనిచేసి ఉంటారని అంతా భావించి ఉండొచ్చు. కానీ ఈ చిత్రానికి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించింది ఎవరో కాదు నిండా 19 ఏళ్ళు కూడా లేని టీనేజ్ కుర్రాడు. ఆశ్చర్యంగా అనిపిస్తున్నప్పటికీ ఇది నిజం. ఉజ్వల్ కులకర్ణి అనే 19 ఏళ్ల కుర్రాడు ఇంతటి భారీ చిత్రానికి ఎడిటింగ్ చేశాడు. 

ఉజ్వల్ కులకర్ణి షార్ట్ ఫిలిమ్స్ కోసం ఎడిటింగ్ చేశాడు. ఫ్యాన్ మేడ్ ఎడిట్స్ చేస్తూ ప్రశాంత్ నీల్ కంట్లో పడ్డాడు. ఉజ్వల్ వర్క్ కి ఫిదా అయిన ప్రశాంత్ నీల్.. అతడికి కెజిఎఫ్ టీజర్ కట్ చేసే భాద్యత ఇచ్చాడు. ఆ పనిని ఉజ్వల్ అద్భుతంగా పూర్తి చేశాడు. దీనితో మరింతగా ఇంప్రెస్ అయిన ప్రశాంత్ నీల్.. ఉజ్వల్ కి కేజిఎఫ్ 2 సినిమా మొత్తం ఎడిటింగ్ బాధ్యతని అప్పగించాడు . 

గురువారం విడుదలైన కెజిఎఫ్ 2 బ్లాక్ బ్లస్టర్ టాక్ సొంతం చేసుకుంది. దీనితో ఉజ్వల్ కులకర్ణి ప్రతిభ మరింతగా వెలుగులోకి వచ్చింది. ఈ కుర్రాడు ప్రస్తుతం ఇండియా మొత్తం హాట్ టాపిక్ గా మారాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rajamouli కి పోటీగా.. 1000 కోట్లతో శంకర్ సినిమా, ఎప్పుడు స్టార్ట్ కాబోతోంది? హీరో ఎవరు?
Venu Swamy: అయ్యో, వేణు స్వామి పూజ వృధాగా పోయిందిగా.. అఖండ 2 వాయిదాతో మరోసారి ట్రోలింగ్