ఖిలాడీ టీజర్: టూ డేంజరస్ గా కనిపిస్తున్న రవితేజ!

Published : Apr 12, 2021, 11:01 AM ISTUpdated : Apr 12, 2021, 11:02 AM IST
ఖిలాడీ టీజర్:  టూ డేంజరస్ గా కనిపిస్తున్న రవితేజ!

సారాంశం

 ఉగాది పండగను పురస్కరించుకొని ఖిలాడి మూవీ టీజర్ నేడు విడుదల చేశారు. ఖిలాడి చిత్ర టీజర్ లో రవితేజ క్యారెక్టర్ చాలా భిన్నంగా ఉంది. ఆయన పాత్రలో నెగిటివ్ షేడ్స్ కనిపించడం విశేషం.   

క్రాక్ విజయంతో ఊపుమీదున్న రవితేజ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో మన ముందుకు రానున్నారు. రమేష్ వర్మ దర్శకత్వంలో ఆయన ఖిలాడి మూవీ చేస్తున్నారు. ఉగాది పండగను పురస్కరించుకొని ఖిలాడి మూవీ టీజర్ నేడు విడుదల చేశారు. ఖిలాడి చిత్ర టీజర్ లో రవితేజ క్యారెక్టర్ చాలా భిన్నంగా ఉంది. ఆయన పాత్రలో నెగిటివ్ షేడ్స్ కనిపించడం విశేషం. 


ఖైదీగా, కిల్లర్ గా డిఫరెంట్ షేడ్స్ ఆయన పాత్ర కలిగి ఉంది. మరో విభిన్నమైన పాత్ర ఖిలాడి చిత్రం ద్వారా రవితేజ ట్రై చేస్తున్నట్లు అర్థం అవుతుంది. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ మూవీలో విలన్ రోల్ చేస్తున్నాడని సమాచారం. ఆయన లుక్ కూడా టీజర్ లో రివీల్ చేశారు. రెండు పవర్ ఫుల్ పాత్రల మధ్య జరిగే ఆధిపత్య పోరు అబ్బుర పరచడం ఖాయంగా కనిపిస్తుంది. 


రావు రమేష్, వెన్నెల కిషోర్, అనసూయ, ముఖేష్ రిషి వంటి నటులు ఖిలాడి మూవీలో కీలకరోల్స్ చేస్తున్నారు. మొత్తంగా టీజర్ తోనే సినిమాపై హైప్, ఆకాశానికి లేపేశాడు రవితేజ. డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి ఖిలాడి మూవీలో హీరోయిన్స్ గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. టీజర్ లో దేవిశ్రీ బీజీఎమ్ మరో ఆకర్షణ అని చెప్పాలి. సమ్మర్ కానుకగా మే 28న ఖిలాడి విడుదల కానుంది. 
 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి విలన్ గా రెండు నిమిషాలు మాత్రమే కనిపించిన సినిమా ఏదో తెలుసా?
OTT: ఒకే రాత్రి 3 హ‌త్య‌లు, ఊహ‌కంద‌ని ట్విస్టులు, ప్ర‌తీ సీన్ క్లైమాక్సే.. ఓటీటీలో సూప‌ర్ థ్రిల్ల‌ర్