నటితో డ్రైవర్ అసభ్య ప్రవర్తన!

Published : Jul 11, 2019, 02:47 PM IST
నటితో డ్రైవర్ అసభ్య ప్రవర్తన!

సారాంశం

ప్రముఖ బెంగాల్ టీవీ సీరియల్ నటి స్వస్తికా దత్త పట్ల డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ డ్రైవర్ ని అరెస్ట్ చేశాడు. 

ప్రముఖ బెంగాల్ టీవీ సీరియల్ నటి స్వస్తికా దత్త పట్ల డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ డ్రైవర్ ని అరెస్ట్ చేశాడు. వివారాల్లోకి వెళితే.. సీరియల్ షూటింగ్ కి వెళ్లడానికి బుధవారం నాడు ఉదయం స్వస్తికాదత్త ఉబెర్ లో క్యాబ్ బుక్ చేసుకుంది.

కారులో షూటింగ్ స్పాట్ కి వెళ్తుండగా.. మార్గమధ్యలో డ్రైవర్ బుకింగ్ ని క్యాన్సిల్ చేసి.. ఆమెను బయటకి లాగాలని ప్రయత్నించాడు. దీంతో ఆమె ప్రతిఘటించింది. వెంటనే డ్రైవర్ ఆమెని కారులోనే మరో ప్రదేశానికి తీసుకువెళ్లడానికి ప్రయత్నించాడు.

తన స్నేహితులను ఫోన్ చేసి వాళ్లని కూడా రమ్మని చెప్పాడు. దీంతో బెదిరిపోయిన స్వస్తికా వెంటనే కారు దిగి గట్టిగా కేకలు వేయడంతో డ్రైవర్ కారుతో సహా పారిపోయాడు. 

ఇదంతా కేవలం అరగంట వ్యవధిలో జరిగిందని స్వస్తికా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కారు నెంబర్, డ్రైవర్ పేరుతో సహా వివరాలను షేర్ చేయడంతో వెంటనే పోలీసులు డ్రైవర్ ని అరెస్ట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Mohan Babu చిరంజీవి అన్నదమ్ములుగా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?
Suma Rajeev Divorce: తల్లిదండ్రుల విడాకుల విషయంలో అసలు జరిగింది ఇదే.. చెప్పేసిన సుమ కొడుకు రోషన్