పోసానికి ఆపరేషన్ వికటించిందా..?

Published : Jul 11, 2019, 02:19 PM IST
పోసానికి ఆపరేషన్ వికటించిందా..?

సారాంశం

ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ ఏడాది ఎన్నికల సమయంలో ఆయన వైఎస్సార్ సీపీ తరఫున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.. 

ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ ఏడాది ఎన్నికల సమయంలో ఆయన వైఎస్సార్ సీపీ తరఫున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.. ఆ తరువాత ఆయన ఆరోగ్యం క్షీణించింది.

ఇటీవల ఆయన హెర్నియా ఆపరేషన్ చేయించుకున్నారు. కానీ ఆ ఆపరేషన్ ఫెయిల్ అయినట్లు సమాచారం. ఆపరేషన్ జరిగిన చోట ఇన్ఫెక్షన్ వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో పోసాని మరోసారి హాస్పిటల్ లో జాయిన్ అయినట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది.

మరోసారి హెర్నియా ఆపరేషన్ జరిపినట్లు, ఒకట్రెండు రోజుల్లో ఆయన్ని డిశ్చార్జ్ చేయబోతున్నట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. నటుడిగా పోసాని ఎంతో బిజీగా ఉన్నారు.

అలానే రాజకీయాల వైపు కూడా మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి సమయంలో ఆయన ఆరోగ్యం క్షీణించడం బాధాకరం. త్వరలోనే ఆయన కోలుకొని మళ్లీ సినిమాలతో బిజీ అవ్వాలని కోరుకుందాం!

PREV
click me!

Recommended Stories

సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే
ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్