గర్ల్ ఫ్రెండ్ ని రహస్య వివాహం చేసుకున్న స్టార్ హీరోయిన్?

Published : Jul 18, 2021, 09:07 AM IST
గర్ల్ ఫ్రెండ్ ని రహస్య వివాహం చేసుకున్న స్టార్ హీరోయిన్?

సారాంశం

హాలీవుడ్ భామ క్రిస్టెన్ స్టెవార్ట్ తన గర్ల్ ఫ్రెండ్ ని రహస్యంగా వివాహం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. లేడీ స్క్రీన్ రైటర్ డైలాన్ మేయర్ ని ఆమె వివాహం చేసుకున్నారని కథనాలు వెలువడుతున్నాయి.   

స్వలింగ సంపర్కం, స్వలింగ వివాహాలు విదేశాలలో చాలా కామన్. అది అక్కడ చట్టబద్దం కూడా. సెలబ్రిటీలు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడినప్పుడు అది పెద్ద న్యూస్ అవుతుంది. తాజాగా హాలీవుడ్ భామ క్రిస్టెన్ స్టెవార్ట్ తన గర్ల్ ఫ్రెండ్ ని రహస్యంగా వివాహం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. లేడీ స్క్రీన్ రైటర్ డైలాన్ మేయర్ ని ఆమె వివాహం చేసుకున్నారని కథనాలు వెలువడుతున్నాయి. 


తనని తాను ఫెమినిస్ట్ గా చెప్పుకునే క్రిస్టెన్, గర్ల్ ఫ్రెండ్ డైలాన్ తో డేటింగ్ చేస్తున్నట్లు బహిరంగంగానే ప్రకటించడం జరిగింది. అలాగే వీరు చెట్టాపట్టాలేసుకొని బయట తిరుగుతున్నారు. కలిసి పార్టీలకు హాజరవుతున్నారు. డైలాన్ తో అలా బహిరంగంగా తిరిగితే అవకాశాలు ఇవ్వమంటూ నిర్మాతలు హెచ్చరికలు జారీ చేసినా ఆమె వినడం లేదట. క్రిస్టెన్, డైలాన్ ఒకే రకమైన వివాహ ఉంగరాలు ధరించి ఉన్న నేపథ్యంలో వీరు రహస్య వివాహం చేసుకున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. 
 

ట్విలైట్ సిరీస్ తో బాగా పాప్యులర్ అయిన  క్రిస్టెన్‌ స్టెవార్ట్‌ గతంలో ఆ చిత్ర హీరో రాబర్ట్‌ పాటిన్‌సన్‌తోనూ రిలేషన్‌షిప్‌ నడిపించింది. ఆ తర్వాత డైరెక్టర్‌ రుపెర్ట్ శాండర్స్‌తో కొన్నాళ్లూ, తిఆ తరువాత విజువల్‌ ఎఫెక్ట్స్‌ ప్రొడ్యూసర్‌ అలిసియా కార్గిలేతో, న్యూజిలాండ్‌ మోడల్‌ స్టెల్లా మాక్స్‌వెల్‌తోనూ డేటింగ్‌ చేసింది. ఆపై ఓ టీవీ షో టైంలో డైలాన్‌ మెయర్‌కి దగ్గరై డేటింగ్‌ చేస్తూ.. లాస్‌ ఏంజెల్స్‌లో ఇద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode:కార్తీక్, దీపలపై దశరథ ఫైర్-కార్తీక్ ఎమోషనల్-చావు బ్రతుకుల్లో సుమిత్ర
Jabardasth Naresh Remuneration: జబర్దస్త్ నరేష్‌ ఈవెంట్‌కి తీసుకునే పారితోషికం ఎంతో తెలుసా? చాలా ఖరీదైన కమెడియన్‌