న్యూస్ రీడర్ గా ఎంతో సుపరిచితమైన టీవీ5 మూర్తి దర్శకుడిగా అవతారం ఎత్తబోతున్నాడు. హీరో నారా రోహిత్ కంబ్యాక్ ఫిల్మ్ తో డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నట్టు తెలుస్తోంది. మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది.
తెలుగు ప్రజలకు న్యూస్ రీడర్ టీవీ5 మూర్తి (TV5 Murthy) సుపరిచితుడే. ఎన్నో డిబెట్స్ నిర్వహించి మంచి ఫేమ్ దక్కించుకున్నారు. పొలిటికల్ ఇంటర్వ్యూలు, చర్చలతో పాపులారిటీని సొంతం చేసుకున్నారు. తనదైన శైలితో ఆకట్టుకున్నారు. ఇక తర్వలో దర్శకుడిగా అవతారం ఎత్తబోతున్నాడని తెలుస్తోంది. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నా హీరో నారా రోహిత్ (Nara Rohit) కంబ్యాక్ సినిమాను మూర్తి డైరెక్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది.
ఇక తాజాగా నారా రోహిత్ 19వ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ కూడా అందింది. చివరిగా ఆయన ‘ఆటగాళ్లు’, ‘వీర భోగ వసంత రాయులు’ చిత్రాలతో అలరించారు. ఈ చిత్రాలు 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ తర్వాత ఐదేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇక మళ్లీ గట్టిగా కంబ్యాక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. వరుస ప్రాజెక్ట్స్ ను లైన్ పెట్టారు. ఇప్పటికే నాలుగు సినిమాలు షూటింగ్ జరుపుకున్నట్టు తెలుస్తోంది. వీటికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.
కొద్దిసేపటి కింద Nara Rohit 19వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నారా రోహిత్ కమ్ బ్యాక్ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా జూలై 24న విడుదల చేయబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. చాలా కాలం విరామం తీసుకున్న హీరో నారా రోహిత్ ఎట్టకేలకు తిరిగి వస్తున్నాడు. కెరీర్ ప్రారంభం విభిన్న కథలతో ప్రేక్షకులను అలరించిన రోహిత్ కంబ్యాక్ తో మరింతగా ఎంటర్ టైన్ చేయబోతున్నారని తెలుస్తోంది. తాజాగా మేకర్స్ ప్రీ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్‌లో పేపర్ కట్‌లు ఉన్న చేతిని చూపించారు. ’ఒక వ్యక్తి అన్ని అసమానతలకు వ్యతిరేకంగా నిలబడతాడు’ అనే ఆసక్తికరమైన కోట్ ను కూడా అందించారు.
చిత్రానికి సంబంధించిన డిటేయిల్స్ రావాల్సి ఉన్నాయి. వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో చిత్రం రూపుదిద్దుకుంటుందని మాత్రం ప్రకటించారు. ఇతర తారాగణం, టెక్నీకల్ టీమ్, డైరెక్టర్ వంటి అంశాలను తర్వలో ప్రకటించనున్నారు. ప్రస్తుతానికి టీవీ5 మూర్తి డైరెక్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది. పొలిటికల్ సబ్జెక్ట్ తో సినిమాను తెరకెక్కించున్నారని సమాచారం. గతంలో రోహిత్ ‘ప్రతినిధి’ చిత్రంతో అలరించిన విషయం తెలిసిందే. ఇక ‘ప్రతినిధి 2’నే తెరకెక్కించబోతున్నారని అంటున్నారు. మరోవైపు మీడియాపై సినిమా ఉండబోతుందని టాక్. ఏదేమైనా ఫస్ట్ లుక్ తో మరింత క్లారిటీ రానుంది. త్వరలో దీనిపై మేకర్స్ అఫీషియల్ అప్డేట్ ఇవ్వనున్నారు.