Karthika deepam 2 Latest episode: డ్రైవర్ గా మారిన కార్తీక్, కళ్ళు తిరిగి పడిపోయిన దీపా.. స్వప్నకు గట్టి షాక్

Published : Sep 29, 2025, 09:10 AM IST
Karthika deepam

సారాంశం

కార్తీకదీపం 2 (Karthika deepam 2) టుడే ఎపిసోడ్ లో కార్తీక్, దీప కిచెన్ లో వంట చేస్తుండగా ఎపిసోడ్ మొదలవుతుంది. వీరిద్దరూ మాట్లాడుకోవడం జ్యో, పారిజాతం వింటారు. దీనివల్ల వారితో కొంతసేపు గొడవపడతారు. ఆ తర్వాత కార్తీక్ ను డ్రైవర్ గా తీసుకెళ్తుంది జ్యో. 

కార్తీకదీపం 2 లేటెస్ట్ ఎపిసోడ్ లో కిచెన్ లో కార్తీక్, దీప కలిసి వంట చేస్తూ ఉంటారు. వారిద్దరూ మాట్లాడుకోవడం జ్యోత్స్న చూస్తుంది. వారి మాటలు దొంగ చాటుగా వింటూ ఉంటుంది. ఆ సమయంలో దీప కార్తీక్ తో జ్యో మాటల విని అమ్మ సొంత ఆలోచనలను చెడగొట్టుకుంటుందని అంటుంది. జ్యోత్స్న వల్లే అమ్మ దోషిగా మిగిలిపోయిందని, అమ్మానాన్నలు ఇద్దరూ మొండి వాళ్లేనని దీప అంటుంది. అదే సమయంలో జ్యో, పారిజాతం ఇద్దరూ ఆ మాటలు వింటారు. వెంటనే అక్కడికి వచ్చి ‘మీ అమ్మ గురించి నీకు ఏం తెలుసు’ అని గొడవ పెట్టుకుంటారు. ఆ గొడవ పూర్తయ్యాక కార్తీక్ తో జ్యోత్స్నా ‘నా కారు క్లీన్ చేశావు కదా.. వెళ్దాం పద’ అని తీసుకెళ్తుంది.

తిను మరదలా..

జ్యోత్స్నతో వెళ్లేముందు కార్తీక్ దీపతో ‘ఆరోగ్యం పాడవుతుంది.. తిను మరదలా’ అని చెప్పి వెళతాడు. మరోవైపు శ్రీధర్, కావేరి మాట్లాడుకుంటూ.. అల్లుడు ఇక్కడ ఉండేందుకు ఇబ్బంది పడుతున్నాడేమో వేరే ఇల్లు చూద్దామా అని అంటారు. ఆ తర్వాత శ్రీధర్ ఇంటికి జ్యో, పారిజాతం కలిసి వస్తారు. అప్పుడు శ్రీధర్ ‘ఇక్కడికి ఎందుకు వచ్చారు’ అని వారిని ప్రశ్నిస్తారు. దానికి మధ్యలో స్వప్న వచ్చి ‘ఈ ఇంట్లో వాళ్ళు మర్యాదలు మర్చిపోయినట్టున్నారు.. వచ్చిన వాళ్ళని బట్టి మర్యాదలు ఉంటాయి’ అని అంటుంది. అప్పుడు పారిజాతం మేము వచ్చింది మా మనవడి కోసమని అంటుంది. వెంటనే స్వప్న అలాంటి వాళ్ళు ఎవరు ఇంట్లో లేరని చెప్పేస్తుంది.

‘మనవడు స్టేషన్లో ఉన్నాడని ఫోన్ చేయగానే పరిగెత్తుకొని వచ్చి మరీ విడిపించారు కదా.. ఎవరు ఎలాంటి వాళ్ళో బాగా అర్థమవుతుంది’ అని స్వప్న కోపంగా మాట్లాడుతుంది. వెంటనే జ్యో ‘నీ భర్త ఏమైనా నెల రోజులు జైల్లో ఉన్నాడా.. నువ్వు ఫోన్ చేసి మమ్మల్ని హెల్ప్ అడిగావా’ అని ప్రశ్నిస్తుంది. ఈలోపు శ్రీధర్.. దాసు వైజాగ్ వెళ్ళాడని చెబుతాడు. అప్పుడే కాశీ కూడా వస్తాడు. మీరెందుకు వచ్చారని ప్రశ్నిస్తాడు. పారిజాతం మనవడు ఎలా ఉన్నాడో చూసి వెళ్దామని వచ్చామని చెబుతుంది.

నీ సాయం నాకొద్దు

కాశీతో జ్యో మాట్లాడుతూ ఉద్యోగం, పరువు పోగొట్టుకున్నావు.. చేతిలో పైసా లేదు, మావయ్య ఇంట్లో తల దాచుకుంటున్నావని తెలిసి సాయం చేద్దామని వస్తే.. ఇదేనా ఇచ్చే మర్యాద అని ప్రశ్నిస్తుంది. దానికి కాశి తనకు ఎవరి సాయం అవసరం లేదని చెబుతాడు. మరోపక్క స్వప్న, జ్యోత్స్న మాటలతో పోట్లాడుతూ ఉంటారు. అదే సమయంలో జ్యో మాట్లాడుతూ బయట డ్రైవర్ ఉన్నాడు నా ఫోను హ్యాండ్ బాగ్ తీసుకు రమ్మని చెప్పు అని స్వప్నకి చెబుతుంది. స్వప్న బయటకు వచ్చి డ్రైవర్ గా ఉన్న కార్తీక్ ను చూసి షాక్ అవుతుంది. తనే డ్రైవర్ అని చెబుతాడు కార్తీక్. స్వప్న కోపంతో లోపలికి వెళ్లి డ్రైవర్ ఎవరో కాదు మా అన్నయ్య అని అందరికీ చెబుతుంది. కార్తీక్ ను అలా చూసి శ్రీధర్ కూడా ఎంతో బాధపడతాడు.

పడిపోయిన దీప

మరోవైపు ఇంట్లో ఉన్న దీపా కిచెన్ లో కళ్ళు తిరిగి పడిపోతుంది. దీప పడిపోయిన శబ్దం విని సుమిత్ర వస్తుంది. దీప కళ్ళు తెరిచి చూసేసరికి సుమిత్ర ఒడిలో ఉంటుంది. దాంతో షాక్ అవుతుంది దీప. సుమిత్ర మాట్లాడుతూ ప్లేట్ తీసుకొచ్చి భోజనం ఇచ్చేంత మానవత్వం ఉంది కానీ తినిపించేంత ప్రేమ లేదని అంటుంది.

మరోవైపు కాశీతో కార్తీక్ మాట్లాడుతూ ఉంటాడు. జాబ్ పోయినంత మాత్రాన జీవితం పోయినట్టేనా అని కార్తీక్ ప్రశ్నిస్తాడు. అప్పుడే దీప కళ్ళు తిరిగి పడిపోయిందని సుమిత్ర ఫోన్ చేసి చెబుతుంది. కార్తీక్ అక్కడ నుంచి బయలుదేరుతాడు. మరోవైపు జ్యోత్స్న కాశీకి జాబ్ ఇప్పిస్తానని అంటుంది. దానికి కాశీ తనకు ఎవరి రికమండేషన్ అవసరం లేదని చెబుతాడు. జ్యో ఇచ్చిన డబ్బులను కూడా తీసుకోడు. మరోవైపు సుమిత్ర దీప దగ్గరే ఉంటుంది. ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగిసిపోతుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: దీపను తప్పుపట్టిన కాంచన- అత్తా, కోడళ్ల మధ్య దూరం పెరగనుందా?
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: పెళ్లికి ఓకే చెప్పిన జ్యో- తండ్రితో కన్నీళ్లు పెట్టించిన కాంచన