రిషభ్ శెట్టికి తప్పని తిప్పలు, కాంతార 1 సెట్లో మరో ప్రమాదం

Published : Jun 15, 2025, 10:09 AM IST
రిషభ్ శెట్టికి తప్పని తిప్పలు, కాంతార 1 సెట్లో మరో ప్రమాదం

సారాంశం

కాంతార-1 షూటింగ్ సమయంలో బోటు బోల్తా పడింది. రిషబ్ శెట్టితో సహా 30 మంది ప్రాణాలతో బయటపడ్డారు. మాణి జలాశయంలో జరిగిన ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే.?

రిషబ్ శెట్టి నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న  ప్రీక్వెల్ సినిమా కాంతార-1.  చిత్రానికి విఘ్నాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఒకే నెలలోనే సినిమాలో పాల్గొన్న ముగ్గురు మరణించడం సంచలనంగా మారిన క్రమంలో రీసెంట్ గా  మరో ప్రమాదం మూవీ టీమ్ ను కుదిపేసింది.

కాంతార-1 షూటింగ్ సెట్‌లో మరో ప్రమాదం జరిగింది. మాస్తికట్టె మాణి జలాశయంలో షూటింగ్ బోటు బోల్తా పడిపోయింది. కెమెరామెన్, నటుడు రిషబ్ శెట్టితో సహా 30 మంది ప్రాణాలతో బయటపడ్డారని సమాచారం.

బోటు బోల్తా పడిన తర్వాత కళాకారులు, సాంకేతిక నిపుణులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. గత వారం విజు వి.కె. మరణం తర్వాత సినిమా చివరి దశ షూటింగ్ కొనసాగుతోంది. మాణి జలాశయం వద్ద 15 రోజుల పాటు షూటింగ్ జరపాలని ప్రణాళిక వేసుకున్నారు. కానీ, ఇప్పుడు కెమెరాతో సహా బోటులో ఉన్న  సామాగ్రి మొత్తం నీటిపాలయ్యాయి. ప్రమాదం వల్ల ఏమైంది? ఎవరైనా చనిపోయారా అనే దానిపై ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది.

వరాహి నది వెనుక ప్రాంతంలో షూటింగ్ జరుగుతుండగా బోటు బోల్తా పడింది. శివమొగ్గ జిల్లా, తీర్థహళ్లి తాలూకా, యడూరు సమీపంలోని మాణి జలాశయంలో షూటింగ్ జరుగుతోంది.  మేలిన కొప్ప అనే మునిగిపోయిన గ్రామం వద్ద కాంతార-1 షూటింగ్ జరుగుతోంది.  హీరో కమ్ డైరెక్టర్  రిషబ్ శెట్టి, ఇతరులు ఉన్న బోటు నీటిలో మునిగిపోయి కెమెరా పూర్తిగా పాడైపోయింది. కాని అదృష్టం కొద్ది ప్రాణ నష్టం జరగలేదు. 

మునిగిపోయిన గ్రామం కావడంతో అక్కడ ఎక్కువ నీరు లేదు. ఎవరికీ ప్రాణాపాయం లేకుండా అందరూ బయటపడ్డారు. నటుడు రిషబ్ శెట్టితో సహా చాలా మంది బోటులో ఉన్నారు. ప్రమాదం తర్వాత షూటింగ్ ఆపేసి, ఇప్పుడు యడూరు సమీపంలోని ఒక రిసార్ట్‌లో మూవీ టీమ్ విశ్రాంతి తీసుకుంటున్నారు. 

ముందు హాసన్‌లో జరిగిన షూటింగ్‌లో నిప్పు పెట్టడం వల్ల చెట్లకు నష్టం జరిగింది. ఆ తర్వాత హాసన్ జిల్లా, సకలేశపుర తాలూకా, హేరూరు గ్రామంలోని గవిగుడ్డ ప్రాంతంలో జరుగుతున్న షూటింగ్‌కు స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ తర్వాత కాంతార చిత్ర బృందంపై అక్రమంగా చెట్లు నరికి, బాంబులు వాడి, నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలు వచ్చాయి.

ఇవన్నీ జరిగిన తర్వాత, మూవీ టీమ్  కళాకారులను తీసుకెళ్తున్న బస్సు కొల్లూరులో ప్రమాదానికి గురై, బస్సులో ఉన్న జూనియర్ ఆర్టిస్ట్ గాయపడ్డారు.  అంతే కాదు  సౌపర్ణిక నదిలో ఈతకు వెళ్లిన సహ కళాకారుడు కపిల్ నీటిలో మునిగి మరణించగా, వివాహానికి హాజరైన నటుడు రాకేష్ పూజారి గుండెపోటుతో మరణించారు. అయితే, సినిమాలో రాకేష్ షూటింగ్ పూర్తయినందున ఎలాంటి సమస్య రాలేదు.

అంతే కాదు  వారం క్రితం కేరళ కళాకారుడు వి.కె. విజు గుండెపోటుతో మరణించడం చిత్ర బృందాన్ని కలవరపెట్టింది. కేరళలోని త్రిసూర్‌కు చెందిన మిమిక్రీ కళాకారుడు విజు కాంతార సినిమా కోసం ఆగుంబే సమీపంలోని యడూరులో ఒక హోమ్ స్టేలో ఉంటున్నారు. రాత్రి విజుకు ఛాతి నొప్పి వచ్చి, తీర్థహళ్లి ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మరణించారు. ఇప్పుడు మొత్తం సినిమా బృందంలోని ముఖ్య వ్యక్తులు ఉన్న బోటు బోల్తా పడింది. ఇలా ఒకదాని వెంట మరొకటి ప్రమాదాలు జరుగుతండటంతో సినిమా టీమ్ ఆలోచనలో పడింది. దీనికి కారణాలేంటి అనేది చర్చిస్తున్నట్టు సమాచారం. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ, సంజనాల డ్రామాలు కళ్లకి కట్టినట్టు చూపించిన బిగ్‌ బాస్‌.. కళ్యాణ్‌ ఫస్ట్‌ ఫైనలిస్ట్
Bharani: తన ఒరిజినాలిటీ బయటపెట్టిన భరణి.. మెగా బ్రదర్‌ నాగబాబు స్ట్రాటజీ పనిచేస్తుందా?