
Guppedantha Manasu Serial Today: అనుపమ ఇంటికి వచ్చినప్పటి నుంచి మహేంద్ర బాగా డిస్టర్బ్ అవుతూ ఉంటాడు. జగతి ఫోటో తీసుకని బాధగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే రిషి లోపలికి వస్తాడు.‘ ఇక్కడ ఎందుకు ఉన్నారు..? మీ ఫ్రెండ్ వచ్చింది కదా’ అని రిషి అంటాడు. దీంతో, మహేంద్ర తను ఏమైనా ఫీలైందా? నీకు ఏమైనా చెప్పిందా అని అడుగుతాడు. లేదని సమాధానం ఇచ్చిన రిషి, అలా ఫ్రెండ్ ఇంటికి వచ్చినప్పుడు ఎవాయిడ్ చేయడం మంచిది కాదని, వెళ్లి మాట్లాడండి అని రిషి సలహా ఇస్తాడు. కానీ మహేంద్ర నిరాకరిస్తాడు. అనుపమ మాట్లాడే మాటలు గుండెల్లో గునపంలా గుచ్చుకుంటున్నాయి అని బాధపడతాడు. అయితే, వెళ్లిపోమ్మని చెబుదాం, ఇంకెప్పుడు మన ఇంటికి రావద్దు అని చెబుదాం అని రిషి అంటాడు. అయితే, మహేంద్ర వద్దు అని, అనుపమతో అలా అనలేను అంటాడు. దీంతో, రిషి మహేంద్రకు హిత బోధ చేస్తాడు. అంత దూరం నుంచి మీ కోసం మీ ఫ్రెండ్ వస్తే, ఇలా ఎవాయిడ్ చేయకూడదంటాడు. అసలు, అనుపమ అమ్మ ఉన్నప్పుడే వచ్చి ఉంటే, అసలు అమ్మకు తాను ఎప్పుడో దగ్గరై ఉండేవాడినని రిషి కూడా ఫీలౌతాడు. తర్వాత అనుపమతో నార్మల్ గా మాట్లాడమని, మన కోసం వచ్చిన వారిని దూరం పెట్టకూడదని సలహా ఇస్తాడు. అమ్మ మీద ప్రేమ తోనే ఇలా చేస్తోందని చెబుతాడు.
మరోవైపు కిచెన్ లో అనుపమ కాఫీ తాగుతూ ఉంటుంది. వసుధార వంట చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో అనుపమకు దేవయాణి మాటలు గుర్తుకు వస్తాయి. అదే విషయం గురించి అడుగుతుంది. నువ్వు జగతి శిష్యురాలివా? ఇప్పుడు ఎండీ అయ్యావ్ అని అడుగుతుంది. అంత చిన్న వయసులోనే ఎండీ ఎలా అయ్యావ్ అని అడుగుతుంది. అంతేకాదు, జగతి స్థానంలోకి నువ్వు వచ్చావా అని అడుగుతుంది. దానికి వసుధార జగతి మేడమ్ స్థానాన్ని తాను భర్తీ చేయలేను అంటుంది. ఆ తర్వాత మళ్లీ అనుపమ.. డబ్బు, హోదా ఈ రెండింటిలో నువ్వు దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావ్ అని అడుగుతుంది.దానికి వసు.. తాను ఆ రెండింటికంటే ప్రేమకు ఎక్కువ ఇస్తాను అని చెబుతుంది. డబ్బు అనేది మనిషికి అవసరం మాత్రమే అని, హోదా అనేది మనిషిలోని ఓ భావన మాత్రమే అంటుంది. అయితే, అనుపమ మాత్రం నీకు తెలీకుండానే నువ్వు ఎండీ అయిపోయాను అంటావ్ అంతేనా అంటుంది. దానికి వసు మనసు బాధపడుతుంది. అలా ఎందుకు గుచ్చిగుచ్చిఅడుగుతోందో అర్థం కాదు.
వసు మాట్లాడకుండా కామ్ గా ఉన్నా, అనుపమ వదిలిపెట్టకుండా సమాధానం చెప్పమని అడుగుతుంది. దానికి వసు, మీరు నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు, నేను మిమ్మల్ని కూడా మా జగతి మేడమ్ లానే చూస్తాను అంటుంది. దానికి అనుపమ.. వసుధార చాలా తెలివైందని అర్థం చేసుకుంటుంది. ఇంతలో మహేంద్ర వచ్చి, భోజనానికి అన్నీ ప్రిపేర్ చేయమంటాడు. అనుపమ కోసం స్పెషల్ గా దోసకాయ పచ్చడి చేయమని అడుగుతుతాడు. అనుపమ ఏమో, మహేంద్ర కోసం మిరపకాయ బజ్జీలు చేయమని అడుగుతుంది. వసు నవ్వుతూ సరే అని సమాధానం ఇస్తుంది.
ఇక, ధరణి ఇంట్లో వంట చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో శైలేంద్ర వచ్చి, చాలా ప్రేమగా మాట్లాడతాడు. ఎప్పుడూ వంటింట్లోనే ఉంటావా? రెస్ట్ తీసుకోమని సలహా ఇస్తాడు. అయితే, ఈ పని ఎవరు చేస్తారు అని ధరణి అడిగితే, పని మనిషిని పెడతాను అని అంటాడు. ఆ మాటలకు ధరణి పొంగిపోతుంది. తాను అన్ని పనులను ప్రేమగా చేయగలను అని చెబుతుంది. తర్వాత శైలేంద్ర , ధరణి కోసం తెచ్చిన గిఫ్ట్ ఇస్తాడు. అందులో చీర ఉంటుంది. ఇక, అంతే ధరణి ఆకాశంలో ఎగిరినంత సంతోషిస్తుంది. శైలేంద్ర చీర తేవడమే కాదు, ఆ చీరను ధరణి మీద వేసి మరీ ప్రేమగా మాట్లాడతాడు. తాను మారిపోయాను అని ధరణికి అర్థమయ్యేలా మాట్లాడతాడు. ఇక, ధరణి పూర్తిగా శైలేంద్ర మాయలో పడిపోతుంది. తన మనసుకు నచ్చినట్లు మారుతున్నాడని సంబరపడిపోతుంది.
ఇక, వసుధార వంట పూర్తి చేస్తుంది, మహేంద్ర స్వయంగా అందరికీ వడ్డిస్తాడు. అనుపమ కూడా, మహేంద్రకు వడ్డిస్తుంది. అందరూ కలిసి భోజనం చేస్తారు. అనుపమ, మహేంద్ర సంతోషంగా పాత విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే, రిషి,వసులు సంతోషపడతారు. వంటలు చాలా బాగున్నాయి అని మహేంద్ర వసుకి కాంప్లిమెంట్ ఇస్తాడు. ఆ సమయంలో వసుధార కు ఒక డౌట్ వస్తుంది. మీ భర్త ఏం చేస్తారు..? మీకు పిల్లలు ఎంత మంది? ఎక్కడున్నారు? ఏం చేస్తారు అని అడుగుతుంది. అయితే, రిషి వసుని అడగొద్దు అని ఆపేస్తాడు. అనుపమ మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వదు.
తర్వాత భోజనం అయిపోయి అందరూ సంతోషంగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు మహేంద్ర వచ్చి అనుపమకు ఐస్ క్రీమ్ తెచ్చి ఇస్తాడు. ఆ తర్వాత నేను బయలుదేరతాను అని అనుపమ వెళ్తూ ఉంటుంది. అలా వెళ్లేముందు వసు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతుంది. తాను పెళ్లి చేసుకోలేదని, ఒంటరిగానే ఉన్నాను. మీ మేడమ్ పెళ్లి చేసుకున్నా ఒంటరిగా ఉందని, నేను పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉన్నానని చెబుతుంది. దీంతో, మహేంద్ర కోపంగా, అనుపమ ఇంకోసారి ఇక్కడికి రాకు అని అరుస్తాడు. అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కానీ, తర్వాత రిషి మాత్రం మీరు అప్పుడప్పుడు వస్తూ ఉండండి అని అడుగుతాడు. అనుపమ కూడా వస్తానని, మహేంద్రను జగతి బాధ నుంచి బయటపడేలా చేస్తానని చెప్పి, వెళ్లిపోతుంది.