Guppedantha Manasu Serial Today: శైలేంద్రే హంతకుడు దొరికిన సాక్ష్యం, షాక్ లో రిషి కుటుంబం..!

By telugu news teamFirst Published Nov 30, 2023, 8:13 AM IST
Highlights

క్లూ దొరికింది అనే విషయ తెలిసి దేవయాణి కి టెన్షన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. దేవయాణి పడుతున్న కంగారును వసు గమనిస్తుంది. ఆ సమయంలోనే ముకుల్ అక్కడికి వచ్చేస్తాడు. వచ్చి కూర్చున్న తర్వాత జగతి మేడమ్ కేసులో క్లూ దొరికిందని, నిందితుడు చాలా తెలివైన వాడు అని అంటాడు. 

Guppedantha Manasu Serial Today: చిత్ర విషయం లో వసుధారను ఇరికించాలని శైలేంద్ర వేసిన ప్లాన్ బెడిసి కొట్టింది. ఈ విషయాన్ని దేవయాణి శైలేంద్రకు చెప్పడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. కానీ, ఫోన్ కలవదు. తీరా ఫోన్ కలవక కలవక ఫోన్ కలిస్తే, ఆ ఫోన్ ధరణి లిఫ్ట్ చేస్తుంది. శైలేంద్రకు ఫోన్ ఇవ్వమని దేవయాణి చెప్పినా, ధరణి వినిపించుకోదు. పని అమ్మాయి వస్తోందా? వంట చేస్తోందా? మామయ్య గారు బాగున్నారా లాంటి ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది. ఆ సంభాషణ విని  శైలేంద్ర అక్కడకు వస్తాడు. అమ్మ ఫోన్ చేస్తే నాకు ఇవ్వాలి కదా ధరణి అంటూ చాలా సౌమ్యంగా మాట్లాడి ఫోన్ తీసుకుంటాడు. ధరణికి వేరే పని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు.

ఫోన్ అందుకోగానే దేవయాణి శైలేంద్రను తిట్టేస్తుంది. అయితే, శైలేంద్ర మాత్రం కూల్ గా వసుధార కేసులో ఇరక్కుంది మనం కాదు ఎంఎస్ఆర్ అని అంటాడు. ఈ విషయం నీకుఎలా తెలుసు అని దేవయాణి ప్రశ్నించగా, మొత్తం కథ నడిపింది తనేనని, ఎవరినోట ఏ డైలాగ్  రావాలో అంతా తానే ప్లాన్ చేశానని చెబుతాడు. తెలివిగా రిషిని డైవర్ట్ చేసిందుకు కొడుకుని దేవయాణి అభినందిస్తుంది. ఇక, శైలేంద్ర తన క్రిమినల్ బ్రెయిన్ ని  తానే మెచ్చుకుంటాడు. తల్లిని భయపడవద్దని, మన పేరు భయటకు మాత్రం రాదు అని చెబుతాడు. ఎప్పటికైనా ఎండీ సీటు మనం దక్కించుకోవడం ఖాయం అని చెబుతాడు.

Latest Videos

మరోవైపు అనుపమ అన్న మాటలను రిషి తలుచుకుంటాడు. జగతి ని చంపిన వాళ్లను ఎందుకు పట్టుకోవడానికి ఇంత ఆలస్యం అయ్యిందని అనుపమ అన్న మాటలను తలుచుకొని తనలో తానే మాట్లాడుకుంటాడు. తన అమ్మ చావును ఎప్పుడూ సింపుల్ గా తీసుకోలేదని, నిందితుల కోసం గాలిస్తూనే ఉన్నాను అని అనుకుంటాడు. ఈలోగా వసుధార , రిషిని పిలుస్తుంది. కిచెన్ లో ఉన్న వసు దగ్గరకు రిషి వస్తాడు. ఇంతకీ కిచెన్ కి ఎందుకు వచ్చావ్ అంటే, మీరు సరిగా భోజనం కూడా చేయలేదని ఆరోగ్యం అశ్రద్ధ చేస్తున్నారని పెరుగులో పంచదార  కలుపుతూ ఉంటుంది. అది చూసి రిషి, తనకు నచ్చలేదు అంటాడు. అయితే, మీకు ఇష్టమే కదా అని వసు అంటే, పెరుగు కాదు, నీ ప్రేమ నాకు నచ్చలేదు అంటాడు.

రిషి అన్నదానికి అర్థంకాన్నట్లుగా వసు చూస్తూ ఉంటుంది. అప్పుడు ప్రేమ రెండు పక్షాలుగా ఉండాలని, నన్ను ప్రేమించడమే కాదు, నిన్ను నువ్వు కూడా ప్రేమించుకోవాలి అని సలహా ఇస్తాడు. నన్నునేను ప్రేమించుకోకపోయినా, నా కన్న నన్ను ఎక్కువగా ప్రేమించడానికి మీరు ఉన్నారు కదా అని వసు ప్రేమగా బదులిస్తుంది. ఇద్దరూ కాసేపు ఒకరినొకరు పొగుడుకుంటారు. తర్వాత ఆ పెరుగును ఇద్దరూ, ఒకరికి మరొకరు ప్రేమగా తినిపించుకుంటారు. ఆ క్రమంలో వసు పెదాలకు ఆ పెరుగు అంటుతుంది. దానిని రిషి తన చేతులతో తుడుస్తాడు. అక్కడ కాస్త రొమాంటిక్ గా ఉంటుంది. సరిగ్గా ఆ సమయంలో రిషి ఫోన్ మోగుతుంది.

జగతి కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారి ముకుల్ ఫోన్ చేస్తాడు. ఈ కేసులో నిందితులను పట్టుకునే క్రమంలో తనకు ఒక వాయిస్ దొరికిందని, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నప్పుడు వినిపిస్తానని, ఎక్కడ కలుద్దాం అని అడుగుతాడు. అయితే, రిషి తన పెద్దమ్మ ఇంట్లోనే కలుద్దాం అని చెబుతాడు.

తెల్లారితే దేవయాణి ఇంట్లో అందరూ మీటింగ్ అయ్యి కూర్చుంటారు. శైలేంద్ర, ధరణి తప్ప అందరూ అక్కడే ఉంటారు.  క్లూ దొరికింది అనే విషయ తెలిసి దేవయాణి కి టెన్షన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. దేవయాణి పడుతున్న కంగారును వసు గమనిస్తుంది. ఆ సమయంలోనే ముకుల్ అక్కడికి వచ్చేస్తాడు. వచ్చి కూర్చున్న తర్వాత జగతి మేడమ్ కేసులో క్లూ దొరికిందని, నిందితుడు చాలా తెలివైన వాడు అని అంటాడు. అయితే, ఎంత తెలివైన క్రిమినల్ అయినా ఒక్కోసారి పొరపాట్లు చేస్తూ ఉంటాడు. ఆ కోణంలో ఆలోచించి  ప్రయత్నిస్తే, ఒక క్లూ దొరికిందని ముకుల్ చెబుతాడు. నిందితుడికి సంబంధించిన వాయిస్ దొరికిందని చెబుతాడు.

ఆ వాయిస్ ప్లే చేయమని మహేంద్ర అడగడంతో, ముకుల్ ప్లే చేస్తాడు. ఆ వాయిస్ శైలేంద్ర ది అనే విషయం ఇంట్లో అందరికీ అర్థమైపోతుంది. రిషి, ఫణీంద్ర అయితే అది జీర్ణించుకోలేరు. ఆ గొంతు తన కొడుకు శైలేంద్రదే అని ఫణీంద్ర అంగీకరిస్తాడు. వాడే జగతిని చంపేశాడా అని ఫణీంద్ర చాలా బాధపడతాడు. ఇక్కడ జరిగింది మొత్తం ఆల్రెడీ ఇంకో ఫోన్ లో శైలేంద్ర వింటూనే ఉంటాడు. మరోవైపు అందరూ ఆ వాయిస్ శైలేంద్రది అని అంటుంటే, దేవయాణి మాత్రం అది తన కొడుకు వాయిస్ కాదు అని వాదిస్తుంది. తన కొడుకు మంచిచేసే వాడే కానీ,  మనుషులను చంపేవాడు కాదు అని అంటుంది. అది తన కొడుకు వాయిస్ కాదని గ్రాఫిక్స్ చేశారు అంటుంది. వీడియో, ఫోటోలను గ్రాఫిక్ చేయవచ్చు కానీ,  వాయిస్ ని చేయలేం అని ముకుల్ చెప్పగానే, అయితే, ఎవరో మిమిక్రీ చేశారు అని అంటుంది. తన కొడుకు మాత్రం ఏ తప్పూ చేయలేదని వాదిస్తుంది. అయితే, ముకుల్ ఈ ఒక్క సాక్ష్యంతో చర్యలు తీసుకోమని, కేవలం ఇంటిరాగేషన్ చేస్తామని, ఆ తర్వాత నిజమని తెలిస్తేనే యాక్షన్ తీసుకుంటాం అంటాడు.

దేవయాణి మాత్రం తన కొడుకు తప్పు చేయలేదని నిరూపించడానికి అడ్డమైన లాజిక్ లు మాట్లాడుతుంది.  నిజం కాదని, రిషిని కూడా నమ్మద్దు అని రిషిని బలవంతం చేస్తుంది.  కానీ, రిషి మాత్రం ఆ నిజం జీర్ణించుకోలేడు. అక్కడితో ఎపిసోడ్ ముగిసింది.

click me!