Published : Oct 23, 2024, 06:33 AM IST

Bigg Boss Telugu 8 live Updates|Day 52: ఈ వారం ఆ కంటెస్టెంట్ అవుట్!

సారాంశం

8వ వారానికి గాను నయని పావని, పృథ్విరాజ్, నిఖిల్, విష్ణుప్రియ, ప్రేరణ నామినేట్ అయ్యారు. ఓటింగ్ మొదలైంది. నయని పావని, పృథ్విరాజ్ డేంజర్ జోన్లో ఉన్నట్లు సమాచారం. 

 Bigg Boss Telugu 8 live Updates|Day 52: ఈ వారం ఆ కంటెస్టెంట్ అవుట్!

04:17 PM (IST) Oct 23

వాటర్‌ టాస్క్ లో విన్నర్‌ రాయల్‌ టీమ్‌..

బిగ్‌ బాస్‌ హౌజ్‌లో టాస్క్ ల పరంపర నడుస్తుంది. ఇందులో వాటర్‌ని వెనకాల నుంచి టబ్‌లో పోసే టాస్క్ లో రాయల్‌ టీమ్‌ విన్నర్‌గా నిలిచింది. వైల్డ్ కార్డ్ ద్వారా రాయల్‌ టీమ్‌ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

04:14 PM (IST) Oct 23

గంగవ్వ దెబ్బకి వణికిపోయిన రోహిణి..

ఈ రోజు ఎపిసోడ్‌లో గంగవ్వ అర్థరాత్రి దెయ్యం పట్టినట్టుగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. దీంతో అంతా భయపడిపోయారు. ఉ.. పోసుకున్నంత పని చేశారు. అమ్మాయిలైతే నిద్రలేకుండా గడిపారు. ఈ సంఘటనతో బాగా భయపడిపోయిన రోహిణి మధ్యలో పడుకున్న రోహిణి.. ఎంతగా భయపడిపోయిందో చూపించడం నవ్వులు పూయించింది. 

04:11 PM (IST) Oct 23

గంగవ్వకి దెయ్యం పట్టింది.. హౌజ్‌లో అర్థరాత్రి అల్లకల్లోలం..

బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో షాకింగ్‌ సంఘటన చోటు చేసుకుంది. గంగవ్వకి అర్థరాత్రి దెయ్యం పట్టింది. ఆమె దెయ్యంలా ప్రవర్తించింది. అందరు నిద్రిస్తున్న వేళ ఆమె వింత అరుపులతో అల్లకల్లోలం చేసింది. తాజాగా విడుదలైన ప్రోమోలో ఇది షాకిస్తుంది. 

08:04 AM (IST) Oct 23

గంగవ్వకు బహుమతి ప్రకటించిన నాగ మణికంఠ

నాగ మణికంఠ గంగవ్వకు గిఫ్ట్ ప్రకటించడం విశేషం. ఆమె బయటకు వచ్చాక అర్ధ తులం బంగారం ఇస్తానని అన్నాడు. నాగ మణికంఠ చేసిన వాగ్దానానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. గంగవ్వపై మణికంఠకు ఇంత ప్రేమ, అభిమానం ఉన్నాయా అని బిగ్ బాస్ ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు.

 

గంగవ్వకు నాగ మణికంఠ విలువైన బహుమతి, సంచలన ప్రకటన చేసిన మాజీ కంటెస్టెంట్!

06:34 AM (IST) Oct 23

ఈ వారం ఆ కంటెస్టెంట్ అవుట్!

8వ వారానికి గాను నయని పావని, పృథ్విరాజ్, నిఖిల్, విష్ణుప్రియ, ప్రేరణ నామినేట్ అయ్యారు. ఓటింగ్ మొదలైంది. నయని పావని, పృథ్విరాజ్ డేంజర్ జోన్లో ఉన్నట్లు సమాచారం. వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. కాగా రాయల్ క్లాన్ కి చెందిన నయని పావని ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది.