మాటల మాంత్రికుడుగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ రీసెంట్ గా మహేష్ బాబు(Mahesh Babu) తో ‘గుంటూరు కారం'(Guntur Kaaram) చేసారు. ఆ సినిమా కు డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ పరంగా సంక్రాంతికు ఊపేసింది. 215 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిందని ట్రేడ్ టాక్. ఇక గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు రాజమౌళితో సినిమా పనుల్లో బిజీ అయ్యిపోతున్నారనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా ఏంటి అనేది హాట్ టాపిక్ గా మారింది. “గుంటూరు కారం” కథ, కథనాల విషయంలో త్రివిక్రమ్ విమర్శలు ఎదుర్కొన్నారు. దాంతో, త్రివిక్రమ్ తదుపరి చిత్రం విషయంలో కన్ఫ్యూజన్ ఏర్పడింది.
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు త్రివిక్రమ్ తన కొత్త ప్రాజెక్టుకు దాదాపు అంతా ఓకే అయ్యినట్లు సమాచారం. సాధారణంగా ఓ సినిమా చేస్తున్నపుడే నెక్ట్స్ సినిమాను కూడా లైన్‌లో పెట్టుకోవడం త్రివిక్రమ్ స్టైల్. ఎప్పుడూ ఇదే చేస్తుంటారు త్రివిక్రమ్. ఈ సారి కూడా ఇదే చేసారు. కాకపోతే ఈ సారి ప్లాన్స్ మారాయి. అల్లు అర్జున్ సినిమా ప్రకటించినా.. అది ఆలస్యమయ్యేలా కనిపిస్తుంది. మరో ఆర్నెళ్లకు పైగానే పుష్ప 2తో బిజీగా ఉంటారు అల్లు అర్జున్. ఈ లెక్కన అన్ని రోజులు త్రివిక్రమ్ ఆయన కోసమే వేచి చూడాల్సి వస్తుంది. ఈ లోగా ఎవరితో చేద్దామనుకునే లోగా అనుకోని విధంగా తమిళ స్టార్ సీన్ లోకి వచ్చారని సమాచారం. ఎవరా హీరో అంటే విజయ్.
తమిళ హీరో విజయ్ రాజకీయ రంగప్రవేశం గురించి పెద్ద చర్చే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ 69వ చిత్రం ఓకే అయింది. అంతేకాదు విజయ్ చివరి సినిమా అని చెప్తున్నారు. తెలుగు నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న చిత్రం కావటంతో ఇక్కడా మనవాళ్లు ఈ సినిమా అప్డేట్స్ పై ఆసక్తి చూపిస్తున్నారు. తమిళ టాప్ డైరెక్టర్‌తో పాన్ ఇండియా సినిమా నిర్మించేందుకు దానయ్య ఉన్నారని సమాచారం. ఆ డైరక్టర్ వెట్రిమారన్ అయ్యే అవకాసం ఉందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు నిర్మాత తరుపు నుంచి త్రివిక్రమ్ సీన్ లోకి వచ్చారని ఆయనతో ముందుకు వెళ్లబోతున్నారని, ఈ మేరకు స్క్రిప్టు వర్క్ జరుగుతోందని అంటున్నారు. ఎందుకంటే దానయ్య కేవలం తమిళంలో బిజినెస్ అయ్యితే సరిపోదు..తెలుగులోనూ ఫుల్ గా కావాలని భావించే ఈ డెసిషన్ తీసుకున్నారని తెలుస్తోంది. అయితే ప్రాజెక్టు పూర్తి స్దాయిలో కన్ఫర్మ్ కాలేదని వినికిడి.
ఇక ఇప్పటికే కథ కూడా విజయ్‌కు వినిపించారట. అది విజయ్‌కు కూడా నచ్చిందని, ఆయన ఇందులో నటించడానికి సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు టాక్. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్వకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌లో నిర్మించిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఆస్కార్ బరిలో మూడు అవార్డులను గెలుచుకోవండంతో చిత్ర నిర్మాత 'డీవీవీ దానయ్య' పేరు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆ సినిమా తర్వాత కోలీవుడ్ టాప్ హీరో విజయ్‌తో ఒక భారీ చిత్రాన్ని నిర్మించడానికి ఆయన సన్నాహాలు చేయటం అంటే క్రేజ్ ఓ రేంజిలో ఉంటుందంటున్నారు.
ప్రస్తుతం విజయ్ చేస్తున్న ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత విజయ్ తన 70వ చిత్ర షూటింగ్‌కు సిద్ధం అవుతారని సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారట. ఈ ఏడాదిలోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించే ఆలోచన చేస్తున్నారని వినికిడి. అయితే మరో వైపున రాజకీయాల దిశగా విజయ్ వేస్తున్న అడుగుల కారణంగా, ఆయన తదుపరి ప్రాజెక్టుల విషయంలో కొంత సందిగ్ధం ఉంది. విజయ్ గతంలో దిల్ రాజు నిర్మాతగా వారసుడు చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే.