అల్లు అర్జున్‌ని పక్కన పెట్టి వేరే హీరోలను వెతుక్కున్న త్రివిక్రమ్‌.. నెక్ట్స్ ప్రాజెక్ట్ అదే..?

Published : Jan 01, 2024, 11:24 PM ISTUpdated : Jan 01, 2024, 11:29 PM IST
అల్లు అర్జున్‌ని పక్కన పెట్టి వేరే హీరోలను వెతుక్కున్న త్రివిక్రమ్‌.. నెక్ట్స్ ప్రాజెక్ట్ అదే..?

సారాంశం

అల్లు అర్జున్‌తో చేయాల్సిన సినిమాని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ పక్కన పెట్టాడట. అంతేకాదు వేరే హీరోలను వెతుకుతున్నాడట. ఎట్టకేలకు హీరోలు దొరికినట్టు తెలుస్తుంది. 

అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ టాలీవుడ్‌లో అత్యంత సక్సెస్‌ ఫుల్‌ కాంబోగా పేరుతెచ్చుకుంది. ఈ కాంబినేషన్‌లో `జులాయి`, `సన్నాఫ్‌ సత్యమూర్తి`, `అల వైకుంఠపురములో` చిత్రాలు వచ్చాయి. హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టారు. ఇప్పుడు మరో సారి ఈ కాంబినేషన్‌లో సినిమా రానుంది. గతంలోనే ఈ ఇద్దరి కాంబోలో సినిమాని ప్రకటించారు. ప్రస్తుతం మహేష్‌బాబు తో `గుంటూరు కారం` చిత్రాన్ని రూపొందిస్తున్న త్రివిక్రమ్‌.. నెక్ట్స్ బన్నీతోనే సినిమా చేయాల్సి ఉంది. కానీ దాన్ని పక్కన పెట్టారట. 

అల్లు అర్జున్‌తో చేయాల్సిన సినిమాని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ పక్కన పెట్టాడట. అంతేకాదు వేరే హీరోలను వెతుకుతున్నాడట. విక్టరీ వెంకటేష్‌, నానిల చుట్టూ తిరుగుతున్నాడట. ఇదే ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్ అవుతుంది. అయితే త్రివిక్రమ్‌.. హీరోల చుట్టూ తిరగడం ఏంటనే ఆలోచన వస్తుంది. ఆ వివరాల్లోకి వెళ్లితే.. ప్రస్తుతం బన్నీ.. `పుష్ప2`లో నటిస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్ట్ లో విడుదల కానుంది. అంటే మరో ఎనిమిది నెలలు బన్నీ అందుబాటులో లేడు. ఆయన `పుప్ప2`కే పరిమితం అవుతాడు. 

దీంతో ఈ లోపు వేరే సినిమా చేయాలనుకుంటున్నాడట త్రివిక్రమ్‌. వెంకటేష్‌తో సినిమా చేయాలని భావించారు. అయితే వీరి కాంబినేషన్‌లో సినిమాకి ఆల్‌రెడీ కమిట్‌మెంట్‌ ఉంది. కానీ అది వర్కౌట్ కాలేదు. ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. కానీ కమిట్మెంట్‌ మాత్రం ఉంది. దాన్ని ఇప్పుడు చేయాలని భావిస్తున్నారట త్రివిక్రమ్‌. వెంకీతో సినిమాకి ప్లాన్ చేస్తున్నారు. అయితే దీన్ని మల్టీస్టారర్‌గా ప్లాన్‌ చేస్తున్నారట. రెండో హీరోగా నాని తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. 

త్రివిక్రమ్‌ ఇప్పటి వరకు మల్టీస్టారర్‌ చిత్రాలు చేయలేదు. కానీ మొదటిసారి ప్రయోగం చేస్తున్నారు. `నువ్వు నాకు నచ్చావ్‌`, `మల్లీశ్వరి` తరహాలోనే ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని ప్లాన్‌ చేస్తున్నారట. దీనికి వెంకటేష్‌, నానిని హీరోలుగా అనుకుంటున్నారట. ఇద్దరితోనూ చర్చలు జరిపినట్టు సమాచారం. వాళ్లు పాజిటివ్‌గా ఉన్నారని, ఈ ప్రాజెక్ట్ నెక్ట్స్ కాబోతుందని అంటున్నారు. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్ పై తెరకెక్కనుంది. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానుందని సమాచారం. బన్నీ ఫ్రీ అయ్యే లోపు ఈ మూవీని కంప్లీట్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

ప్రస్తుతం `సైంథవ్‌` చిత్రంలో నటిస్తున్నారు వెంకటేష్‌. శైలేష్‌ కొలను దర్శకుడు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందింది. జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఆ తర్వాత ఇంకా ఏ ప్రాజెక్ట్ ని ప్రకటించలేదు వెంకీ. మరోవైపు ఇటీవల `హాయ్‌ నాన్న`తో హిట్‌ అందుకున్నాడు. ఇప్పుడు `సరిపోదా శనివారం` చిత్రంలో నటిస్తున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్‌ సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Pawan Kalyan కు అభినవ కృష్ణదేవరాయ బిరుదు, ధర్మం, రాజ్యాంగం వేరు కాదన్న పవర్ స్టార్
Samantha Honeymoon Plans, రాజ్ తో కలిసి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత, ఎక్కడికి వెళ్లబోతున్నారో తెలుసా?