త్రివిక్రమ్ నెక్ట్స్ సినిమాలపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత నాగవంశీ, ఏమన్నారంటే?

Published : Jun 12, 2025, 01:56 PM IST
Trivikram confirms next films with Venkatesh

సారాంశం

గుంటూరు కారం తరువాత త్రివిక్రమ్ మరో సినిమా చేయలేదు. ఎవరితో చేస్తాడు అనే విషయంలో చాలా రూమర్లు వినిపించాయి కాని ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇక త్రివిక్రమ్ నెక్ట్స్ సినిమాలపై క్లారిటీ ఇచ్చారు నిర్మాత నాగవంశీ.  

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నెక్ట్స్ ప్రాజెక్టులు ఎవరితో చేస్తారన్న అంశంపై ఇండస్ట్రీ‌లో ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవల అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో త్రివిక్రమ్ పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో, ఈ ఊహాగానాలకు తెరదించాడు నిర్మాత నాగవంశీ. త్రివిక్రమ్ సినిమాలపై సోషల్ మీడియాలో స్పష్టమైన ప్రకటన చేశారు.

త్రివిక్రమ్ సినిమాలపై నాగవంశీ క్లారిటీ 

నాగవంశీ తన అఫీషియల్ ఎక్స్’పేజ్ లో ఓ పోస్టు పెట్టారు. అందులో ఈ విధంగా రాశారు. త్రివిక్రమ్ గారి తదుపరి రెండు చిత్రాలు వెంకటేశ్ గారితో, జూనియర్ ఎన్టీఆర్ గారితోనే ఖరారయ్యాయి. మిగిలినవన్నీ కేవలం ఊహాగానాలే. త్రివిక్రమ్ గారి ఏ ప్రాజెక్ట్ అయినా ఖరారైతే నేను అధికారికంగా ప్రకటిస్తాను అని తెలిపారు.

 

 

వెంకటేష్, ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడి సినిమాలు

ఈ ప్రకటన ద్వారా త్రివిక్రమ్ ముందుగా వెంకటేశ్‌తో ఓ సినిమా పూర్తి చేసి, ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్‌తో ఓ మైథాలాజికల్ సినిమాను ప్రారంభించనున్నట్లు స్పష్టమైంది. ఇది తారక్ కెరీర్‌లో పౌరాణిక పాత్రలో మూడో సారి నటించబోతున్నాడు. బాలరామాయణం లో రాముడిగా నటించిన తరువాత చాలా ఏళ్లకు యమదొంగ సినిమాలో కొద్దిసేపు యముడి గా కనిపించాడు ఎన్టీఆర్. ఇక ఈ ప్రాజెక్ట్‌ను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మించనున్నారు.

 

రామ్ చరణ్ , అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ మూవీ సంగతేంటి

త్రివిక్రమ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఇప్పటికే 'అరవింద సమేత' వంటి సూపర్ హిట్ సినిమా ఉంది. ఇక నిజంగా సోషియో మైథలాజికల్ ఫాంటసీ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే, వెంకటేశ్‌తో రూపొందే చిత్రం వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.

ఇక త్రివిక్రమ్ రామ్ చరణ్, అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నట్టు ప్రచారంలో ఉన్న వార్తలన్నీ రూమర్స్ అని తెలుస్తోంది. ఇక వెంకటేష్ సినిమాపై త్రివిక్రమ్ ఎప్పుడు ప్రకటన చేస్తాడో చూడాలి మరి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Renu Desai ని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? బద్రి కంటే ముందే ఇంత కథ జరిగిందా?
Chiranjeeviకి ఊహించని గిఫ్ట్ తో సర్‌ప్రైజ్‌ చేసిన కృష్ణంరాజు.. మెగాస్టార్‌ మర్చిపోలేని బర్త్ డే